Second Surya Grahan 2023 date: మనలో చాలా మంది గ్రహణాన్ని అశుభకరంగా భావిస్తారు. అందుకే గ్రహణ సమయంలో ఏ పనులు, శుభకార్యాలు చేయవద్దు అన పండితులు చెబుతారు. సూర్య, చంద్ర గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ సంవత్సరం నాలుగు గ్రహణాలు ఉండగా.. ఇప్పటికే రెండు గ్రహణాలు సంభవించాయి. ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం అక్టోబరు 14న సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం ఈ రాశులకు అననుకూలం
సింహ రాశి - సంవత్సరంలో రెండవ సూర్య గ్రహణం సింహ రాశి వారికి అశుభకరంగా ఉంటుంది. మీకు ధన నష్టం వాటిల్లుతుంది. సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు. లావాదేవీలు చేసేటప్పుడు, పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
తుల రాశి- సూర్యగ్రహణం వల్ల తులరాశివారు చెడు ఫలితాలను ఎదుర్కోంటారు. మీరు మానసికంగా కృంగిపోతారు. మీకు ఇతరులతో విభేదాలు వస్తాయి. ఈ సమయంలో సంయమనంతో వ్యవహారించండి.
కన్యా రాశి - ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం కన్యా రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. మీ స్నేహితులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు మోసపోయే అవకాశం ఉంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని వ్యాధులు చుట్టుముడతాయి.
Also Read: Mercury transit 2023: అక్టోబరు వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?
మేషరాశి - రాబోయే సూర్యగ్రహణం మేషరాశి వారికి అనేక సమస్యలను కలిగిస్తుంది. మీ సొంతవారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీరు కెరీర్ లో అనేక అడ్డంకులను ఎదుర్కోంటారు. గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీరు భారీగా నష్టపోయే అవకాశం ఉంది.
వృషభం - ఈ ఏడాది సంభవించబోయే రెండో సూర్యగ్రహణం మీకు బాధాకరంగా ఉంటుంది. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీ ఆర్థిక పరిస్థితి దిగజారే అవకాశం ఉంది. డబ్బు భారీగా నష్టపోతారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోండి.
Also Read: Most Luckiest Zodiac Sign: ఆగస్టు నెలలో మోస్ట్ లక్కీ రాశులవారు వీరే..మీరు అసలే తగ్గకండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook