Naga Panchami Importance: దేశవ్యాప్తంగా నాగ పంచమి పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగకు హిందూమతంలో అంత ప్రాముఖ్యత ఉంది మరి. ప్రతి నెల పంచమి రోజు సర్పాలను పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలోని శుక్లపక్ష పంచమిని నాగ పంచమిగా (Naga Panchami 2022) జరుపుకుంటారు. ఈ రోజు అంటే ఆగస్టు 2, 2022న నాగ పంచమిని జరుపుకోనున్నారు. ఈ ఏడాది ఈ రోజు అరుదైన యాదృచ్చికం జరుగబోతుంది.
నాగ పంచమి నాడు శివయోగం
30 ఏళ్ల తర్వాత నాగ పంచమి రోజు శివయోగం (Shiva Yogam) ఏర్పడుతుంది. ఈ యోగాన్ని ఆస్ట్రాలజీలో శుభప్రదంగా భావిస్తారు. శివయోగంలో నాగదేవతను పూజించడం వల్ల శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ యోగంలో చేసిన పూజలు మీకు రెట్టింపు ఫలితాన్నిచ్చి..మీరు ధనవంతులయ్యేలా చేస్తాయి.
కాల సర్ప దోషం నుండి బయటపడాలంటే..
జాతకంలో కాల సర్ప దోషం నుండి బయటపడటానికి నాగ పంచమి రోజు ఉత్తమంగా భావిస్తారు. ఈ రోజు శివయోగం కూడా ఏర్పటం వల్ల దోషాలన్నీ తొలగిపోతాయి. దీంతోపాటు ఈ రోజున మంగళ గౌరీ వ్రతం కూడా జరుపుకోనున్నారు. ఈ రోజున నాగదేవతతోపాటు శివపార్వతులకు కూడా పూజలు చేస్తే...వారి అనుగ్రహం మీకు లభిస్తుంది.
నాగ పంచమి పూజ ముహూర్తం
శ్రావణ మాసం పంచమి తిథి 2 ఆగస్టు 2022 మంగళవారం ఉదయం 05:13 నుండి ఆగస్టు 3వ తేదీ ఉదయం 05:41 వరకు ఉంటుంది. ఈ సమయంలో నాగదేవత ఆరాధన, శివపార్వతుల పూజలు చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు కలుగుతాయి.
Also read; Naga Panchami 2022: నాగ పంచమి రోజున ఈ పని అస్సలు చేయకండి, మీ సంపద మెుత్తం పోతుంది!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
Naga Panchami 2022: 30 ఏళ్ల తర్వాత నాగ పంచమి రోజు అరుదైన యాదృచ్ఛికం!