Nag Panchami Luck Zodiac Signs: నాగపంచమి నాడు నాగదేవతను పూజిస్తారు. ఈ నాగపంచమి యెుక్క అవశ్యకతను పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా పురాణాలలో పేర్కొనబడింది. శ్రావణమాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి(Nag Panchami 2023) పండుగను జరుపుకోనున్నారు. ఈ సారి ఈ ఫెస్టివల్ ఆగస్టు 21న వస్తుంది.
పూజా విధానం
చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ ఎవరి తాహతు ప్రకారం వారు ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నైవేద్యం పెట్టాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.
అనంతరం నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల నాగదేవత అనుగ్రహం మీకు లభిస్తుంది. అంతేకాకుండా మీరు పాపాల నుండి విముక్తి పొంది, సర్ప భయం తొలగిపోతుంది. ఈ సారి నాగ పంచమి సోమవారం వస్తుంది. పైగా ఆ రోజు పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ పండుగను జరుపుకోవడం వల్ల నాగదేవత ఆశీస్సులతోపాటు మహాదేవుడు ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఈసారి వచ్చే నాగపంచమి నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు నాగపంచమి రోజున అపారమైన సంపదను పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
కుంభ రాశి
నాగపంచమి రోజున కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజున గుడికి వెళ్లి శివుడిని పూజించడం వల్ల శుభఫలితాలను పొందుతారు.
Also Read: Saturn transit: 2025 వరకు కుంభరాశిలోనే శని.. లగ్జరీ లైఫ్ అనుభవించే రాశులివే..!
మేషరాశి
నాగ పంచమి నాడు మేషరాశి వారు అన్ని సమస్యల నుండి బయటపడతారు. కెరీర్ లో పురోగతి ఉంటుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు భారీగా లాభపడతారు.
ధనుస్సు రాశి
నాగ పంచమి ఈరాశివారికి కలిసి వస్తుంది. వీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీకు సహోద్యోగుల సపోర్టు లభిస్తుంది.
Also Read: Parama Ekadashi Vrat: పరమ ఏకాదశి వ్రత ప్రాముఖ్యత, పూజా విధానం, ఉపవాసం చేయడం కలిగే లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి