LaxmiDevi: లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి... ఈ సింపుల్ పరిహారాలు చేయండి! ఇక చూస్కోండి మీపై డబ్బు వర్షమే..

LaxmiDevi: లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలాంటి మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పరిహారాలేంటో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2022, 10:54 AM IST
LaxmiDevi: లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి... ఈ సింపుల్ పరిహారాలు చేయండి! ఇక చూస్కోండి మీపై డబ్బు వర్షమే..

Goddess Laxmi Remedies: ఎవరిపై అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. మహాలక్ష్మీ కటాక్షం ఉంటే మన పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. పేదరిక మన దరిచేరదు. అలాంటి సంపదలకు అదిదేవత అయిన లక్ష్మీదేవిని (Goddess Laxmi Remedies) ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు ఏంటో తెలుసుకుందాం. 

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే పరిహారాలు..
>> లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శంఖాన్ని పూజించాలి. శంఖం లక్ష్మీదేవికి సంబంధించినది పైగా దీనిని హిందువులు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ ఇంటి పూజా స్థలంలో శంఖాన్ని ఉంచి, క్రమం తప్పకుండా పూజిస్తే...లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీపై కనకవర్షం కురిపిస్తుంది. 
>> మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలంటే.. ఒక పటిక ముక్కను పాత్రలో ఉంచి ఇంట్లో ఎవరూ చూడని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కుతారు. 
>> మీరు లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే... ఉదయాన్నే మీ ఇంటి తలుపులు మరియు కిటికీలను తెరవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతోపాటు డబ్బు వస్తుంది.
>> లక్ష్మీ దేవి కటాక్షం సిద్ధించాలంటే..  ఇంటి పూజా స్థలంలో అన్నపూర్ణ మాతను ప్రతిష్టించి...క్రమం తప్పకుండా పూజించాలి. ఇలా చేయడం వల్ల తల్లి అన్నపూర్ణ ప్రసన్నురాలవుతుంది. ఎవరైతే ఇలా చేస్తారో అతని ఇంట్లో దరిద్రం ఉండదు. అతనికి తిండికి, డబ్బుకి ఎప్పుడూ కొరత రాదు. 

Also Read: Lucky Gemstone: కర్కాటక రాశి వారు ఈ ఉంగరాన్ని ధరిస్తే.. అద్భుతమైన కెరీర్, అంతులేని ధనం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News