Budh Uday July 2023: కర్కాటక రాశిలో ఉదయించనున్న బుధుడు..ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం

Budh Uday 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు ఈ నెలలో అస్తమించి వచ్చే నెలలో ఉదయించబోతున్నాడు. బుధుడి గమనంలో ఈ మార్పు వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2023, 05:35 PM IST
Budh Uday July 2023: కర్కాటక రాశిలో ఉదయించనున్న బుధుడు..ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం

Mercury will Rise in Cancer on 07th July 2023: ఇటీవల బుధుడు తన రాశిని మార్చి వృషభరాశిలోకి ప్రవేశించాడు. జూన్ 19న అదే రాశిలో అస్తమించబోతున్నాడు. అనంతరం మెర్క్యూరీ జూలై 07న కర్కాటక రాశిలో ఉదయించనున్నాడు. దీంతో కొందరి అదృష్టం ప్రకాశించనుంది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిధునరాశి
కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల మిథున రాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు మంచి లాభాలను పొందుతారు. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

Also Read: Mars Transit 2023: జూన్ 30న అశుభకరమైన యోగం.. ఈ 3 రాశుల జీవితం నాశనం..

కన్య రాశి
కర్కాటక రాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఈరాశి వారికి మేలు జరగనుంది. మీ జాతకంలోని 11వ ఇంట్లో మెర్క్యూరీ ఉదయించబోతున్నాడు. దీంతో మీ ఆదాయం విపరీతంగా పెరగనుంది. మీకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు పాతపెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

మకరరాశి
బుధుడు రాశి మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఇతరులతో మీ సంబంధాలు బలపడతాయి. సమాజంలో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టనర్ షిప్ తో పని చేసేవారు లాభపడతారు.

Also Read: Shani Vakri 2023: శని తిరోగమనంతో ఈ 4 రాశుల జీవితం నాశనం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News