Mercury Transit 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు నిన్న అంటే జూలై 08న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. బుధుడు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మిథునరాశి మరియు కన్యారాశికి అధిపతిగా బుధుడిని భావిస్తారు. మెర్క్యూరీని విద్య, మేధస్సు, కమ్యూనికేషన్ మరియు వ్యాపారానికి కారకుడిగా భావిస్తారు. కర్కాటక రాశిలో బుధుడి సంచారం వల్ల కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉంటుంది.
ఈ 2 రాశులకు ఇబ్బందులు
మేషం - బుధుడి సంచారం వల్ల మీ జీవిత భాగస్వామితో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ కుటుంబంలో గొడవలు వస్తాయి. మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మీ కెరీర్ లో అనేక అడ్డంకులు వస్తాయి. ఈ సమయం మీకు చాలా కష్టంగా నడుస్తోంది.
వృశ్చికం – మెర్క్యూరీ గోచారం వల్ల మీ పని ఒత్తిడి పెరుగుతుంది. మీ సహోద్యోగులతో విభేదాలు వస్తాయి. వ్యాపారులు భారీగా నష్టపోతారు. మీ పనులన్నీ ఆగిపోతాయి. ఎప్పుడూ దరిద్రం మీ చుట్టే తిరుగుతుంది.
Also Read: Kamika Ekadashi 2023: కామిక ఏకాదశి నాడు శుభ యోగం.. ఈ 3 రాశులకు శ్రీహరి ప్రత్యేక ఆశీస్సులు..
ఈ 3 రాశులకు అదృష్టం
కర్కాటక రాశి - మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ విజయానికి దారులు తెరుచుకుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.
ధనుస్సు - మెర్క్యూరీ సంచారం ధనస్సు రాశి వారికి శుభవార్తను అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు భారీగా లాభపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు కెరీర్ లోని అడ్డంకులన్నీ అధిగమిస్తారు.
కుంభం - బుధుడి సంచారం కుంభరాశి వారికి కలిసి వస్తుంది. మీ సంపద పెరుగుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీకు ప్రమోషన్ దక్కుతుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
Also Read: Shukra Gochar 2023: సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు..ఈ 3 రాశులకు బంగారు రోజులు మెుదలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook