Mercury Transit 2023: అతి ముఖ్యమైన గ్రహాల్లో బుధ గ్రహం నవంబర్ 27వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. ఈ గ్రహం వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి సంచారం చేయనుంది. ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కాబట్టి బుధుడు ధనస్సు రాశిలోకి సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రభావం వ్యక్తిగత జాతకం లోని స్థానాలపై ఆధారపడి ఉంటుంది. జాతకంలో బుధుడు ప్రత్యేక స్థానంలో ఉంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం ప్రతికూల స్థానంలో ఉంటే విపరీతమైన నష్టాలతోపాటు జీవితంలో కష్టాలు ఎదురవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అయితే బుధ గ్రహ సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
బుద్ధుడి సంచారం మేష రాశి వారికి వ్యాపారాల్లో ఊహించని లాభాలను కలిగించబోతోంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందే చాన్స్ లు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
సింహరాశి:
సింహ రాశి వారికి బుధ గ్రహం సంచారం కారణంగా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా మీ తోటి ఉద్యోగుల మద్దతు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. ఇక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. ఇక అన్ని రకాల పరిస్థితులు మెరుగుపడి సౌకర్యాలు పెరిగే అవకాశాలున్నాయి.
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి బుధ గ్రహ సంచారం అనేక రకాల ఆర్థిక లాభాలను అందించబోతోంది. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్స్ కూడా పొందుతారు. అంతేకాకుండా గతంలో ఉన్న పెండింగ్ పనులన్నీ ఈ సమయంలో సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా వీరు ధార్మిక ప్రదేశాలకు వెళ్లే ఛాన్సులు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook