Mercury transit 2022: బుధ సంచారం.. ఈ రోజు నుండి మారనున్న ఈ రాశుల భవితవ్యం!

Mercury transit 2022: బుధ గ్రహం రాశిచక్రాన్ని మార్చింది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది.  ఈ సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2022, 11:40 AM IST
Mercury transit 2022: బుధ సంచారం.. ఈ రోజు నుండి మారనున్న ఈ రాశుల భవితవ్యం!

Budh Gochar 2022 Effect: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత తన రాశిని మార్చుకుంటుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపైన ఉంటుంది. బుధుడు నిన్న అంటే జూలై 31 అర్థరాత్రి తన రాశిని (Mercury transit 2022) మార్చింది. ఈ మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. నేటి నుండి ఈ రాశులవారి అదృష్టం మారనుంది.  బుధుడు...మేధస్సు, తర్కం, సంభాషణ, తెలివి, వాణిజ్యం మరియు స్నేహం యొక్క గ్రహంగా భావిస్తారు. మెర్క్యురీ ట్రాన్సిట్ ఏ రాశులవారికి కలిసిరానుందో తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి శుభప్రదం

మేషరాశి (Aries): మెర్క్యురీ సంచారం ఈ రాశివారి జీవితంలో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయం ప్రయాణాలకు అనుకూలం. డబ్బు అనేక విధాలుగా వస్తుంది.  
సింహరాశి (Leo): బుధ సంచార ప్రభావం ఈ రాశివారికి సానుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారులకు పెట్టుబడి పెట్టాలన్నా, లాభాలు ఆర్జించాలన్నా ఇదే మంచి సమయం. 
కన్య (Virgo): బుధుడు రాశి మారడం వల్ల కన్యా రాశి జీవితంలో పెను మార్పు రాబోతుంది. మీరు అనేక రంగాలలో విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. 
ధనుస్సు (Sagittarius): మెర్క్యూరీ సంచారం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది.  ఈసమయంలో మీరు పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. ఈ టైం మీకు అనేక విధాలుగా డబ్బును  తీసుకువస్తుంది. 
కుంభం (Aquarius): బుధ సంచార ప్రభావం కుంభరాశిపై కూడా చాలా సానుకూలంగా ఉంటుంది.  వ్యాపారులు లాభాలు గడించాలంటే ఇదే మంచి సమయం. సమాజంలో వీరికి గౌరవం ఉంటుంది. 

Also Read: Personality by Zodiac: ఈ 5 రాశుల వారు అత్యంత తెలివిగలవారు.. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News