Budh Gochar 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు... ఈ 3 రాశులకు లాభాలే లాభాలు..

Kendra Tirkon Raj Yog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బుధ గ్రహం యొక్క సంచారం కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీంతో మూడు రాశులవారు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 12:09 PM IST
Budh Gochar 2023: అరుదైన యోగం చేస్తున్న బుధుడు... ఈ 3 రాశులకు లాభాలే లాభాలు..

Kendra Tirkon Raj Yog 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. గ్రహాల యువరాజైన బుధుడు ఫిబ్రవరి ప్రారంభంలో మకర రాశిలో సంచరించబోతున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగాన్ని (Kendra Tirkon Raj Yog) జ్యోతిష్యశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈయోగ ప్రభావం అన్ని రాశులవారిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు ఆర్థికంగా లాభపడతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మకర రాశిచక్రం (Capricorn): కేంద్ర త్రికోణ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో లగ్న గృహంలో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే మీరు ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్‌ని పొందవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. మీకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మీరు మంచి లాభాలను ఆర్జిస్తారు. 

తులా రాశిచక్రం (Libra): కేంద్ర త్రికోణ రాజయోగం తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో సంచరిస్తుంది. మీరు మంచి లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. 

మేష రాశిచక్రం (Aries): కేంద్ర త్రికోణ రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. అందుకే మీరు ఈ సమయంలో కొత్త జాబ్ ఆఫర్‌ని పొందే అవకాశం ఉంది. మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. 

Also read: Mars Margi 2023: 10 రోజుల తర్వాత కుజుడు కదలికలో మార్పు.. వీరికి గుడ్ టైమ్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News