Budh Rise 2023: మరో 11 రోజుల్లో ఉదయించబోతున్న బుధుడు.. వీరికి మంచి రోజులు మెుదలు..

Budh Uday 2023: పంచాంగం ప్రకారం, బుధ గ్రహం జనవరి 12న ధనుస్సు రాశిలో ఉదయించబోతోంది. మెర్క్యురీ గ్రహం యొక్క ఈ ఉదయం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2023, 12:13 PM IST
Budh Rise 2023: మరో 11 రోజుల్లో ఉదయించబోతున్న బుధుడు.. వీరికి మంచి రోజులు మెుదలు..

Budh Rise In Dhanu Zodiac 2023: వ్యాపారం మరియు తెలివితేటలకు కారకుడు బుధుడు. జాతకంలో బుదుడు శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి తార్కిక సామర్థ్యంతోపాటు వ్యాపారంలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు. జనవరి 12న బుధుడు ధనుస్సు రాశిలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం ప్రజలందరిపై కనిపిస్తుంది. బుధుడి ఉదయం వల్ల మూడు రాశులవారికి అపారమైన ప్రయోజనం కలుగుతుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మకర రాశిచక్రం (Capricorn): మెర్క్యురీ గ్రహం ఉదయించడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి రెండో ఇంట్లో ఉదయించనున్నాడు. దీంతో మకర రాశి వారు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. మీ సర్కిల్ కూడా పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తిపరంగా మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది.

కన్య రాశిచక్రం (Virgo): బుధ గ్రహం రైజింగ్ కన్య రాశి వారికి ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయిస్తుంది. అందుకే ఈ సమయంలో మీకు అన్ని సంతోషాలు లభిస్తాయి. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈసమయంలో మీరు పెట్టుపడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. 

మేష రాశిచక్రం (Aries): బుధుడి ఉదయించడం వల్ల మీకు సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బుధ గ్రహం యెుక్క ఉదయం జాతకంలో తొమ్మిదో ఇంట్లో జరుగునుంది. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Trigrahi Yog 2023: జనవరిలో త్రిగ్రాహి యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U  

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News