Budh Gochar 2023: శని యెుక్క రాశిలోకి బుధదేవుడు.. ఇక ఈ రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..

Budh Gochar 2023: బుద్ధిని, తెలివితేటలనిచ్చే బుధుడు మకరరాశిలోకి వెళ్లనున్నాడు. దీని సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2023, 08:30 AM IST
Budh Gochar 2023: శని యెుక్క రాశిలోకి బుధదేవుడు.. ఇక ఈ రాశులకు తిరుగుండదు.. డబ్బే డబ్బు..

Budh Gochar 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడి అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బుధుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. సంపద, వ్యాపారం, తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ కు కారకుడిగా బుధుడిని భావిస్తారు. మెర్క్యూరీ రాశిని మార్చడం ద్వారా అది శనిదేవుని రాశిలోకి ప్రవేశించనుంది. బుధుడికి మరియు శనిదేవుడికి మధ్య మిత్రభావం ఉంది. ఫిబ్రవరి 7న బుధదేవుడు మకర రాశిలోకి (Mercury transit in Capricorn 2023)ప్రవేశించనున్నాడు. ఈ మెర్క్యూరీ యెుక్క సంచారం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

మెర్క్యురీ ట్రాన్సిట్ ఈ రాశుల వారికి వరం
వృషభం (Taurus): వృషభ రాశి వారికి బుధుడు మకరరాశిలో సంచరించడం చాలా శుభప్రదం. వీరికి ప్రతి పనిలోనూ అదృష్టం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. బిజినెస్ నిమిత్తం మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
ధనుస్సు (Sagittarius): బుధుడు రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి చాలా లాభాలు కలుగుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. వీరికి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ మాటతీరు వల్ల మీకు లాభం కలుగుతుంది. 
మీనం (Pisces): మీన రాశి వారికి బుధ సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పాత పెట్టుబడి నుండి లాభం పొందుతారు. ఈ సమయం వ్యాపారానికి లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. పెట్టుబడి పెట్టడానికి కూడా ఇదే మంచి సమయం.

Also read: Grah Gochar 2023: 48 గంటల తర్వాత సంచరించనున్న రెండు పెద్ద గ్రహాలు.. ఈ రాశుల వారికి బంగారు రోజులు మొదలు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News