Mauni Amavasya 2024: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి?

Mauni Amavasya 2024 in Telugu: మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఈ రోజున వ్రతం చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 05:24 PM IST
Mauni Amavasya 2024: మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి?

Mauni Amavasya 2024 date: మాఘమాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. ఈరోజున పవిత్రనదుల్లో స్నానం చేసి మౌన వ్రతం పాటించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. సృష్టికి అధిపతి అయిన మనువు ఈ రోజున జన్మించాడు, అందుకే దీనిని మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు.ఈసారి మాఘ అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన రాబోతుంది. ఈ రోజున మౌన వ్రతం చేయడం, గంగాస్నానం చేయడం, దానం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్‌ వద్ద గల గంగానదిలో స్నానం చేయడం వల్ల మోక్షాన్ని పొందడంతోపాటు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజున మౌనంగా ఉండటం వీలుకాకపోతే.. మీ మాటలను అదుపులో పెట్టుకుని మాట్లాడండి. పొరపాటున కూడా మీ నోటి నుండి పరుష పదాలు రాకుండా చూసుకోండి. పురాణాల ప్రకారం, మౌని అమావాస్య రోజు మానసిక స్థితి బలహీనపడుతుంది. ఈ రోజున మౌనవ్రతం పాటించడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. దాని కోసం ఈ పవిత్రమైనరోజున శివకేశవులను పూజించాలి. 

మౌని అమావాస్య ఉపవాస నియమాలు
మౌని అమావాస్య రోజున ఉదయాన్నే లేచి పవిత్రమై నదులు లేదా సరస్సుల్లో స్నానం చేయాలి. అనంతరం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈరోజున ఖచ్చితంగా ఉపవాసం ఉంటూ.. మౌన వ్రతాన్ని పాటించాలి. ఈరోజున ఆకలితో ఉన్నవారికి ఆహరం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. మాఘ అమావాస్య నాడు గోశాలలోని గోవుకు మేత వేయడం, వస్త్రాలు, నువ్వులు, ఉసిరి, దుప్పటి, మంచం, నెయ్యి, అన్నదానం చేయడం వల్ల మేలు జరుగుతుంది. మాఘ అమావాస్యనాడు పూర్వీకులకు శ్రాద్ద కర్మలు చేయడం వల్ల మీకు మోక్షప్రాప్తి కలుగుతుంది. 

Also Read: Astrology: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో ప్రమాదకరమైన కలయిక.. ఈ 3 రాశులకు సమస్యలు తప్పవు ఇక..

Also Read: Solar Eclipse 2024 date: ఏప్రిల్ 08న తొలి సూర్య గ్రహణం.. ఈ 5 రాశులవారు ధనవంతులు అవ్వడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News