Mangal Gochar 2023: చంద్రుడి రాశిలోకి ప్రవేశించబోతున్న అంగారకుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Mars Transit 2023:  గ్రహాలు కాలానుగుణంగా రాశులను ఛేంజ్ చేస్తాయి. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్న కుజుడు వచ్చే నెల 10న కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరికి అదృష్ట తలుపులు తెరుచుకోనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 07:34 AM IST
Mangal Gochar 2023: చంద్రుడి రాశిలోకి ప్రవేశించబోతున్న అంగారకుడు.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని గ్రహాల కమాండర్ గా పిలుస్తారు. ఇతడిని ధైర్యం, సాహసాలకు కారకుడిగా భావిస్తారు. కుజుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం మార్స్ మిథునరాశిలో సంచరిస్తున్నాడు. మే 10న అంగారకుడు చంద్రుడి రాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ రాశిలో జూలై 01 వరకు ఉంటాడు. అనంతరం సింహరాశిలోకి ఎంటర్ అవుతాడు. కర్కాటక రాశిలో కుజుడు సంచారం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

కన్య రాశి
కర్కాటక రాశిలో అంగారక సంచారం కన్య రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ రాశిచక్రం యెుక్క జాతకంలో 11వ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 
కుంభ రాశి 
మీ రాశి యెుక్క ఆరో ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపార నిమిత్తం ప్రయాణం చేయాల్సి రావచ్చు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. 

Also Read: Shani Vakri 2023: రివర్స్ లో ప్రయాణించబోతున్న శని గ్రహం.. వచ్చే 139 రోజులు ఈ రాశులకు బాధాకరం..

మీనరాశి
మార్స్ సంచారం మీన రాశి వారికి మేలు చేస్తుంది. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీ జాతకంలోని ఐదవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా ఆగిపోయిన మీ పనులన్నీ పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.

Also Read: Budh Asta 2023: మరో మూడు రోజుల్లో అస్తమించబోతున్న బుధుడు.. ఈ 3 రాశులకు ప్రతి పనిలో విజయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News