Mangal Gochar In Taurus 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం కుమార, యవ్వనం, వృద్ధాప్యం దశల్లో సంచరిస్తాయి. గ్రహాల కమాండరైన కుజుడు యువకుడిగా వృషభరాశిలో తిరుగుతున్నాడు. అంగారకుడు 24 డిగ్రీల వరకు అదే స్థితిలో ఉంటాడు. దీని ప్రభావం అన్ని రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయంలో నాలుగు రాశులవారు సంపద మరియు పురోభివృద్ధి సాధిస్తారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కుజుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
మేష రాశిచక్రం
యువకుడిగా కుజుడు సంచారం మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు అదృష్ట స్థానంలో ఉంటాడు. దీంతో మీకు లక్ ప్రకాశిస్తుంది. మీకు అనుకోకుండా ధనం వస్తుంది. ప్రయాణం బాగంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి.
కర్కాటక రాశిచక్రం
కుమార స్థితిలో అంగారకుడి ప్రవేశం మీకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే కుజుడు మీ సంచార జాతకంలో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారు. మీరు పాత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి
యూత్ గా అంగారకుడి సంచారం సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ సంచార జాతకంలో కేంద్ర త్రికోణ రాజ్యయోగం ఏర్పరుస్తున్నాడు. మీరు మీ కెరీర్‌లో మంచి వృద్ధిని సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. అదృష్టం కలిసి వస్తుంది.
వృశ్చిక రాశిచక్రం
కుమార స్థితిలో అంగారకుడి సంచారం మీకు ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉండటం వల్ల మీ కెరీర్ బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో మీకు బాధ్యతలు పెరుగుతాయి. కొత్త జాబ్ లభిస్తుంది. వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.
Also Read: Shukra Gochar 2023: త్వరలో మేషరాశిలోకి శుక్రుడు.. ఈ 4 రాశుల కెరీర్ సూపరో సూపరూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.