Mars Transit August 2022: అంగారక సంచారం.. ఈ 4 రాశుల అదృష్టం మారడం ఖాయం!

Mars Transit 2022: కుజ సంచారం 4 రాశుల జీవితాల్లో పెను మార్పు తీసుకు రాబోతోంది. ఈ రాశుల వారికి అంగారకుడి సంచారం బంపర్ బెనిఫిట్స్ అందించనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 10, 2022, 10:49 AM IST
Mars Transit August 2022: అంగారక సంచారం.. ఈ 4 రాశుల అదృష్టం మారడం ఖాయం!

Mangal Gochar 10 August 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. ఈ రోజు అంటే 2022 ఆగస్టు 10న అంగారకుడు తన రాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుజుడు అక్టోబర్ 14, 2022 వరకు ఆ రాశిలోనే ఉంటాడు. దీని సంచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది. ఇప్పటి వరకు కుజుడు మేషరాశిలో రాహువుతో కలిసి చాలా మందికి ఇబ్బందులను కలిగిస్తున్నాడు. అయితే ఇప్పుడు శుక్రుడు అధీనంలో ఉన్న వృషభరాశిలోకి ప్రవేశించిన తర్వాత శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తారు. ఈ అంగారక గ్రహ సంచారం ఏ రాశి వారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై అంగారకుడి అనుగ్రహం
వృషభం (Taurus)- కుజుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నందున వృషభ రాశి వారికి ఈ అంగారక సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొగలరు.  కొత్త జాబ్ వస్తుంది. కెరీర్ లో పురోగతి ఉంటుంది. 

కర్కాటకం (Cancer)- కుజుడు రాశి మార్పు వల్ల కర్కాటక రాశి వారు ఆర్థికంగా లాభపడనున్నారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొత్త జాబ్ వస్తుంది. అప్పులు బాధ నుండి ఉపశమనం పొందుతారు.  

సింహ రాశి (Leo): సింహ రాశి వారికి అంగారక గ్రహ సంచారం చాలా మేలు చేస్తుంది. ఈ సమయంలో వీరు భారీగా డబ్బును పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. 

ధనుస్సు రాశి (Sagittarius)- కుజుడు సంచారం ధనుస్సు రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఇక వీరి లైఫ్ లో కష్టాల పోయి ఆనందం వెల్లివిరిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశివారికి ఇది గోల్డెన్ టైమ్ అనే చెప్పాలి.  

Also Read: Rakshabandhan 2022: భద్ర ఎవరు? ఈ ముహూర్తంలో ఎందుకు రాఖీ కట్టకూడదు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News