Mangal Gochar 2023: ఆగష్టు 18 వరకు సింహరాశిలోనే కుజుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

Mangal Gochar 2023: ప్రస్తుతం గ్రహాల కమాండర్ కుజుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 06:25 PM IST
Mangal Gochar 2023: ఆగష్టు 18 వరకు సింహరాశిలోనే కుజుడు.. ఈ 3 రాశులకు లాభాలు బోలెడు..

Mars transit 2023 effect: నిన్న అంటే జూలై 01న అంగారకుడు కర్కాటక రాశిని విడిచిపెట్టి సింహరాశిలోకి ప్రవేశించాడు. కుజుడు ఆగస్టు 18 సాయంత్రం 03.54 గంటల వరకు అదే రాశిలో ఉంటాడు. ఆ తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు. పైగా ఆదిత్యుడు కుజుడికి మిత్రుడు. మార్స్ పరివర్తనం వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
మీ రాశిచక్రం నుండి ఐదో ఇంట్లో కుజుడు సంచరించనున్నాడు. ఇది మేషరాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రణాళికలను గోప్యంగా ఉంచుతూ ముందుకు సాగండి. లవ్ సక్సెస్ అవుతోంది. 
వృషభం
వృషభ రాశి యెుక్క నాల్గో ఇంట్లో అంగారకుడు సంచరించనున్నాడు. కుజుడి సంచారం వల్ల కెరీర్ లో మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కుటుంబంలోని విభేదాలన్నీ తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పోయిన మీ వస్తువులు దొరుకుతాయి.
మిధునరాశి
రాశిచక్రం నుండి మూడవ పవర్ హౌస్‌లో మార్స్ గోచరించనున్నాడు. దీంతో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విడిచిపెట్టరు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు దానదర్మాలు చేస్తారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

Also Read: Ketu Gochar 2023: జూలై 08 వరకు చిత్రా నక్షత్రంలోనే కేతువు.. ఈ 4 రాశులకు ఊహించనంత ధనలాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News