Mangal Vakri 2022: జనవరి 13 వరకు తిరోగమనంలో కుజుడు... ఈ రాశులకు డబ్బు బోలెడు..

Mangal Vakri 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, జనవరి 13 వరకు కుజుడు తిరోగమనంలో ఉంటాడు. దీని కారణంగా 3 రాశుల వారు ఆర్థికంగా లాభపడతారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 03:40 PM IST
Mangal Vakri 2022: జనవరి 13 వరకు తిరోగమనంలో కుజుడు... ఈ రాశులకు డబ్బు బోలెడు..

Mars Vakri effect: జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సంచారం లేదా తిరోగమనాల ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. రెడ్ ప్లానెట్, క్రూరగ్రహం పిలువబడే అంగారకుడు వచ్చే ఏడాది జనవరి 13వరకు తిరోగమన స్థితిలో ఉండనున్నాడు. కుజుడి రివర్స్ (Retrograde mars 2022) కదలిక వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. వీరు వృత్తి, వ్యాపారంలో అపారమైన సంపదను పొందుతారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

కుజుడు తిరోగమనం మీకు వరం
కర్కాటకం (Cancer): అంగారకుడి తిరోగమనం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీరు షేర్లు, బెట్టింగ్ మరియు లాటరీలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. మార్స్ తిరోగమనం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. పాతపెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
సింహం (Leo): అంగారకుడి తిరోగమనం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు బాగుంటుంది. మీరు భౌతికంగా అన్ని సుఖాలను పొందుతారు. రాజకీయాలతో అనుబంధం ఉన్నవారికి పెద్ద పదవులు దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. 
ధనుస్సు (Sagittarius): కుజుడు యొక్క తిరోగమన చలనం ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. అంగారకుడు వైపరీత రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. దీని కారణంగా మీరు లాభపడతారు. విదేశీ వ్యాపారాలు చేసేవారు భారీగా ప్రయోజనం పొందుతారు. మీ పనికి ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.

Also Read: Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. రేపటి నుండి ఈ 4 రాశులకు దశ తిరగనుంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News