Mangal Dev: జనవరిలో కుజుడు కదలికలో మార్పు.. ఈ 3 రాశులకు గుడ్ డేస్ స్టార్ట్..

Mangal Gochar 2023: ఏ వ్యక్తి జాతకంలో అంగారకుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. జనవరిలో కుజుడు కదలికలో మార్పు కారణంగా మూడు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 01:06 PM IST
Mangal Dev: జనవరిలో కుజుడు కదలికలో మార్పు.. ఈ 3 రాశులకు గుడ్ డేస్ స్టార్ట్..

Mangal Gochar january 2023: ఆస్ట్రాలజీలో అంగారకుడిని కుజుడు, మంగళదేవుడు, రెడ్ ప్లానెట్, గ్రహాల కమాండర్ అనే వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.  ఈ నెలలో మంగళదేవుడు కూడా తన రాశిని మార్చబోతున్నాడు. మేషం మరియు వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. ఎవరి జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారు బలమైన ప్రయోజనాలను పొందుతారు. ఎవరి జాతకంలో మార్స్ బలహీన స్థితిలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. జనవరి 13, 2023న మధ్యాహ్నం 12.07 కుజుడు ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. మంగళ దేవుడు మార్గం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం. 

కుజుడు సంచారం ఈ 3 రాశులకు శుభప్రదం
ధనుస్సు రాశి (Sagittarius): ధనుస్సు రాశి యెుక్క ఐదవ మరియు పన్నెండవ ఇంటికి మంగళ దేవుడు అధిపతి. మీ ఆరోగ్యం బాగుంటుంది. పోటీపరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లేందుకు ఫ్లాన్ చేసుకోండి. మీకు సంబంధించిన ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.  
మకరరాశి (Capricorn): మకర రాశి వారికి కుజుడు నాల్గవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి. అంగారుకుడి యెుక్క కదలిక మకరరాశి వారికి మేలు చేస్తుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. గర్భిణీ స్త్రీలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారుల లాభపడతారు. 
కుంభ రాశి (Aquarius): ఈ రాశి యెుక్క మూడవ మరియు పదవ ఇంటికి మంగళదేవుడు అధిపతి. మీ యెుక్క జాతకంలో కుజుడు నాల్గవ ఇంట్లో ఉంటాడు. మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. మీ లైఫ్ పార్టనర్ తో బంధం బలపడుతుంది. ఆఫీసులో ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేరుతారు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులు లాభపడతారు. 

Also Read: Guru Gochar 2023: 'హన్స్ పంచ మహాపురుష రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News