Makar Sankranti 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడు దివి నుంచి భూమికి దిగి వస్తాడని ప్రజల నమ్మకం. అంతేకాకుండా ఈరోజు స్వర్గం తలుపులు కూడా తెరుచుకుంటాయని పూర్వికులు అంటూ ఉంటారు. అందుకే మకర సంక్రాంతి ఎంతో ప్రత్యేకమైనది. ఈ పండగ రోజు నుంచే మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ పండగ కాలానికి కూడా ముడిపడి ఉంటుంది. మకర సంక్రాంతి రోజు నుంచే పగలు సమయం పెరిగి రాత్రుల సమయం తగ్గుతుంది ఈరోజు ఏ పుణ్యకార్యం చేసిన రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సూర్యభగవానుడిని పూజించి దానాలు చేయడం వల్ల జీవితంలో శ్రేయస్సు, ఆనందం, సుఖసంతోషాలు కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు.
పురాణాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం మకర సంక్రాంతి రోజున పవిత్ర నదీ స్నానాన్ని ఆచరించడం ఎంతో శ్రేయస్కరం. అంతేకాకుండా ఈరోజు దానాలు చేయడం వల్ల వందరెట్లు పుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో గ్రహాలు అనుకూల స్థితిలో లేనివారు ఈ సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పాటు తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల నువ్వులను దానం చేయడం వల్ల కలిగే లాభాలు:
మత విశ్వాసాల ప్రకారం సంక్రాంతి పండగ రోజున నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి. ముఖ్యంగా ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేస్తాడు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకరాన్ని శని దేవుడి రాశిగా పరిగణిస్తారు. కాబట్టి ఈరోజు సూర్య భగవానుడిని పూజించి నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శని సాడే సతి వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా దూరం అవుతాయని ప్రజల నమ్మకం.
తెల్ల నువ్వులు కూడా దానం చేయొచ్చు:
మకర సంక్రాంతి రోజు తెల్ల నువ్వులను దానం చేయడం ఎంతో శుభ్రతమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులను దానం చేయవచ్చని వారు తెలుపుతున్నారు. తెల్ల నువ్వులు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం.. కాబట్టి ఈ రోజు తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం లభించి ఇంట్లో సంపాదన రెట్టింపు అవుతుంది. దీంతోపాటు శని గ్రహ దోషం కూడా పోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Makar Sankranti 2024: మకర సంక్రాంతి రోజు తెల్ల, నల్ల నువ్వులను ఎందుకు దానం చేస్తారో తెలుసా?