Lucky Zodiac Signs: సూర్యుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే అదృష్ట రాశులు ఇవే..!

Lucky Zodiac Signs: పురాణాల ప్రకారం, వెలుగునిచ్చే దేవుడు సూర్యుడు. సూర్యుడి అనుగ్రహం ఉన్న వారికి దేనికీ లోటు ఉండదు. అయితే సూర్యుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టమంట. వారికి ఏ కొరత లేకుండా చూసుకుంటాడ. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 17, 2023, 01:04 PM IST
Lucky Zodiac Signs: సూర్యుడి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండే అదృష్ట రాశులు ఇవే..!

Surya Dev Favorite Zodiac Signs: విశ్వానికి వెలుగును ప్రసాదించే దేవుడు సూర్యుడు. ఇతడు లేకుంటే మానవాళికి వెలుగే లేదు. కంటికి కనిపించే దేవుడు సూర్యభగవానుడు. ఇతడి గురించి మన వేదాల్లో కూడా చెప్పబడ్డాయి. మన జీవితాల్లో చీకటిని పోగొట్టి వెలుగులు నింపే దేవుడు ఈ సూర్యుడు. ఇతడిని భాస్కరుడు, ఆదిత్యుడు అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. గ్రహాలకు రాజుగా సూర్యుడిని భావిస్తారు. పైగా సింహరాశికి అధిపతి. హిందూవులు ఆదివారం నాడు సూర్యభగవానుడి ఆరాధన చేస్తారు. రాగి చెంబుతో నీళ్లు తీసుకుని ఆదిత్యుని ఆర్ఘ్యం ఇస్తే మీకు జీవితంలో దేనికీ లోటు ఉండదు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు మూడు రాశులంటే చాలా ఇష్టమట. వారిపై భాస్కరుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

సింహరాశి: ఆస్ట్రాలజీ ప్రకారం, సింహరాశికి అధిపతి సూర్యుడు. దీంతో ఈ రాశి వ్యక్తులు లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా ధైర్యవంతులు కూడా. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చిన పోరాడతారు. ఈ రాశి వారు ఆదివారం నీటితో సూర్యుడికి అర్ఘ్యమిస్తే వారికి దేనికీ లోటు ఉండదు. 
ధనుస్సు: ఈ రాశిని బృహస్పతి పాలిస్తాడు. వీరు చాలా తెలివైనవారు. ఎంతటి కష్టమెుచ్చినా వెనుకడగు వేయరు. తమ జ్ఞానంతో ప్రతి సమస్యకు సులభంగా పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే వీరు తమ మాటలను అదుపులో ఉంచుకోకపోవడం వీరి బలహీనత. అందుకే ధనస్సు రాశి వారు సూర్యదేవుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. 
మేషం: మేషరాశిని కుజుడు పాలిస్తాడు. వీరిలో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడికి ఇష్టమైన రాశులలో మేషం కూడా ఒకటి. వీరు ఆదిత్యుడిని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. ఈ రాశి వ్యక్తులకు ప్రతి పనిలోనూ విజయం సిద్దిస్తుంది. కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. 

Also Read: Rasi Phalalu 2024 To 2025: ఈ రాశుల వారిపై శని దేవుడి అనుగ్రహం..2024లో పేదరికం, కష్టాలన్నీ మాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

 

Trending News