Shani Transit - Lucky Zodiac Signs: శని కదలికలకు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని కీడు గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి అన్ని రాశులవారిపై పెద్ద ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే 2023 జనవరిలో శని కుంభ రాశిలోకి ప్రవేశించింది. శని గ్రహం దాదాపు ఏ రాశిలోనైనా దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహం 2025 సంవత్సరంలో మార్చి నెలలో ఇతర రాశిలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల మేష రాశివారికి శని సాడే సతి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మకర రాశివారికి శని చెడు ప్రభావం నుంచి విముక్తి కలుగుతుంది. అయితే ఈ శని సంచారంతో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.
మకర రాశి:
మకర రాశి శని సాడే సతి నుంచి వచ్చే సంవత్సరం మార్చిలో ఉపశమనం కలుగుతుంది. దీని కారణంగా వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగ వనరులు కూడా ఏర్పడతాయి. అలాగే నిలిపోయిన డబ్బులు కూడా తిరిగి వస్తాయని దీంతో పాటు గతంలో నిలిపోయిన డబ్బులన్నీ సులభంగా తిరిగి వస్తాయి. దీంతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం ఎంతో కలసి వస్తుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి శని గ్రహం మీన రాశివారికి ప్రవేశించడం వల్ల ఒత్తిడి నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా సమాజంలో వీరికి మంచి పేరు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ సమయంలో వీరి ప్రసంగాలతో అధికారులను ఆకట్టుకుంటారు. దీని కారణంగా ప్రమెషన్స్ కూడా లభిస్తుంది. అంతకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నవారికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు కూడా తొలగిపోతాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి శని ప్రత్యేకమైన ప్రభావం పడడం వల్ల చెడు దృష్టి నుంచి విముక్తి కలుగుతుంది. దీంతో పాటు వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. అదృష్టం కూడా పెరిగి అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.