Lemon Remedies: నిమ్మకాయలతో ఈ చిన్నచిన్న నివారణలు చేస్తే.. నిరుపేదలు కూడా ధనవంతులు అవుతారు!

Do these Lemon measures to become rich. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలలో నిమ్మకాయ ముఖ్యమైంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 6, 2023, 02:36 PM IST
  • నిమ్మకాయలతో ఈ చిన్నచిన్న నివారణలు చేస్తే
  • నిరుపేదలు కూడా ధనవంతులు అవుతారు
  • ఉద్యోగంలో విజయం కోసం ఈ నివారణ
Lemon Remedies: నిమ్మకాయలతో ఈ చిన్నచిన్న నివారణలు చేస్తే.. నిరుపేదలు కూడా ధనవంతులు అవుతారు!

Here is Lemon Remedies for Job, Business, Money and Health: ఈ భూ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటారు. మనిషి సుఖసంతోషాలతో ఉండాలంటే.. లక్ష్మీ దేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టంను పొందలేడు. దాంతో డబ్బు కోల్పేయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవడం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. మీకు కూడా ఇలాంటివి జరుగుతుంటే టెన్షన్ పడాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించడం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలలో నిమ్మకాయ ముఖ్యమైంది. నిమ్మకాయ నివారణలు (Lemon Remedies in Astrology) ఓసారి చూద్దాం. 

వ్యాపార వృద్ధి కోసం:
మీరు కష్టపడి పని చేసినా వ్యాపారంలో విజయం సాధించలేకపోతే.. శనివారం నాడు నిమ్మకాయతో ఆఫీసు లేదా దుకాణం యొక్క నాలుగు గోడలను తాకండి. ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కట్ చేసి.. చౌరస్తాలో నాలుగు దిశలలో ఒక్కొక్క ముక్కను వేయండి. ఈ పరిహారం చేయడం ద్వారా ప్రతికూల శక్తి పోయి వ్యాపారం సాఫీగా నడుస్తుంది.

అదృష్టం కోసం:
మీరు ప్రతి మలుపులో వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లయితే.. అదృష్టం కోసం నిమ్మకాయను తీసుకొని మీ తలపై ఏడు సార్లు కొట్టండి. దీని తరువాత ఈ నిమ్మకాయను రెండు ముక్కలుగా చేయండి. ఈ ముక్కలను నిర్జన ప్రదేశంలో కుడి చేతి నిమ్మకాయను ఎడమవైపు, ఎడమ చేతి నిమ్మకాయను కుడి వైపున వేయండి. అనంతరం నేరుగా ఇంటికి రండి. ఈ పరిహారం చేయడం అదృష్టం మేల్కొంటుంది.

చెడు దృష్టి కోసం:
ఒక వ్యక్తికి చెడు దృష్టి ఉన్నట్లయితే.. నిమ్మకాయను తీసుకొని దానిని తల నుంచి కాలి వరకు ఏడు సార్లు రుద్దాలి. నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేసి ఒక కూడలిలో వేయండి. ఈ పరిహారం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి.

ఉద్యోగంలో విజయం కోసం:
మీరు మీ పనిలో విజయం సాధించకపోతే.. ఉదయాన్నే ఒక నిమ్మకాయ తీసుకొని అందులో 4 లవంగాలను పెట్టండి. ఆపై హనుమాన్ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవండి. హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ.. హనుమాన్ జీని ప్రార్థించండి. ఈ పరిహారం చేయడం ద్వారా వ్యక్తి ఉద్యోగ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు.

Also Read: Lakshmi Jayanti 2023: రేపు లక్ష్మీదేవి జయంతి.. ఈ తప్పులు చేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు!  

Aslo Read: Apple iPhone 14 New Color: కొత్త రంగులో ఐఫోన్ 14.. త్వరలోనే అందుబాటులోకి! పూర్తి వివరాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News