Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?

Janmashtami 2022: కృష్ణ జన్మాష్టమి పండుగను ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్టు 18, 2022 గురువారం నాడు వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 13, 2022, 11:33 AM IST
  • ఆగస్టు 18న కృష్ణ జన్మాష్టమి
  • ఈ రోజున శ్రీకృష్ణుడిని ఇలా పూజించండి
Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి రోజున ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?

Sri Krishna Janmashtami 2022: శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణభగవానుడు. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడి జన్మదినం రోజునే కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. దీనినే జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని రకరకాల పేర్లుతో పిలుస్తారు.  దేవకి వసుదేవులకు ఎనిమిదో సంతానంగా అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుడు జన్మించాడు. ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి (Krishna Janmashtami 2022) ఆగస్టు 18, 2022 గురువారం వస్తుంది. ఈ రోజున శ్రీకృష్ణుడిని భక్తితో పూజిస్తే.. కోరిన కోరికలు తీరుస్తాడని నమ్మకం. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు వాసుదేవుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. అంతేకాకుండా సంతానం కూడా కలుగుతుంది.

జన్మాష్టమి శుభ ముహూర్తం
అభిజీత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం 12:05 నుండి 12:56 వరకు ఉంటుంది. అదే సమయంలో ఆగస్టు 18వ తేదీ రాత్రి 08:41 గంటల నుంచి ఆగస్టు 19వ తేదీ రాత్రి 08:59 గంటల వరకు ధ్రువ యోగం ఉంటుంది. 

ఏమి చేయాలి, ఏమి చేయకూడదు?
>> జన్మాష్టమి రోజున శ్రీకృష్ణునికి పంచామృతాన్ని సమర్పించండి. ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
>>  గోపాలుడికి భోగంలో తులసి ఆకులను వేసి సమర్పించండి. ఇలా చేయడం చాలా మంచిదిగా భావిస్తారు. 
>>  జన్మాష్టమి రోజున తప్పనిసరిగా కొత్త దుస్తులు ధరించాలి.
>>  శ్రీకృష్ణుని పూజలో శుభ్రమైన పాత్రలను ఉపయోగించండి. నాన్ వెజ్ వండిన పాత్ర వాడకండి. 
>>  ఈ రోజున, తులసి మొక్కను ఎరుపు రంగు చున్నీతో కప్పి, నెయ్యి దీపం వెలిగించాలి. తర్వాత ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. దీంతో కోరిన కోరికలన్నీ తీరుతాయి.
>>  శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి ఆ సమయంలో పూజించండి.
>>  ఈ రోజు కూడా ఇతరులను బాధపెట్టవద్దు లేదా వారితో అసభ్యంగా ప్రవర్తించవద్దు.
>>  ఈ రోజున ఎలాంటి చెట్లను లేదా మొక్కలను నరకకండి.  
>>  ఈ రోజున మీకు చేతనైనంత సహాయం చేయండి మరియు పేదలకు సేవ చేయండి.
>>  ఈ రోజున లక్ష్మీ దేవిని కూడా పూజించండి.

Also Read: Venus Transit July 2022: మిథునరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారి కెరీర్ అమోఘం!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News