Ketu Transit 2023: కేతువు గోచారం ప్రభావం, ఈ 3 రాశులకు మహర్దశ పట్టనుందా లేక హాని కలుగుతుందా

Ketu Transit 2023: అనంత విశ్వంలో గ్రహాలు కదులుతూ ఉండటం ఖగోళంలో ఓ ప్రక్రియ. అయితే జ్యోతిష్యశాస్త్రంలో ఈ గ్రహాల కదలికకు ప్రాధాన్యత, మహత్యముంది. విభిన్న గ్రహాలు వివిధ రాశుల్లో పరివర్తనం చెందుతున్నాయని భావిస్తారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 31, 2023, 07:59 AM IST
Ketu Transit 2023: కేతువు గోచారం ప్రభావం, ఈ 3 రాశులకు మహర్దశ పట్టనుందా లేక హాని కలుగుతుందా

Ketu Transit 2023: హిందూమత జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వివిధ గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. దీనిని గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా పిలుస్తారు. రాశి మారేందుకు కొన్ని గ్రహాలు రోజుల వ్యవధి తీసుకుంటే మరి కొన్ని  గ్రహాలు నెలల వ్యవధి తీసుకుంటాయి. మొత్తానికి గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై గణనీయంగా ఉంటుందంటారు జ్యోతిష్య పండితులు.

గ్రహాల్లో రాహు కేతువుల్ని పాప గ్రహాలుగా, నష్టం కల్గించేవిగా భావిస్తారు. అందుకే రాహు, కేతువు గ్రహాల గోచారంపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఈసారి కేతువు గోచారంతో కన్యా రాశిలో ప్రవేశించాడు. ఫలితంగా కొన్ని రాశులకు శుభప్రదంగా, మరి కొన్ని రాశులకు పూర్తిగా ప్రతికూలంగా ఉండనుంది. కేతువు ఏదైనా ఒక రాశిలో ప్రవేశిస్తే ఏకంగా 18 నెలల వరకూ ఉంటుంది. అక్టోబర్ 30 అంటే నిన్న కేతువు కన్యా రాశిలో ప్రవేశించాడు. తిరిగి 2025 మార్చ్ వరకూ అదే రాశిలో కొనసాగనున్నాడు. వివిధ రాశులపై ప్రతికూల, అనుకూల ప్రభావం ఉంటుంది. కెరీర్ ప్రకారం కర్కాటకం, సింహం, కన్యా రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి జాతకులకు కేతువు కన్యా రాశి గోచారంతో కాస్త అనుకూలంగానే ఉండవచ్చు. ముఖ్యంగా ఎప్పట్నించో వేధిస్తున్న సమస్యల్నించి విముక్తి పొందవచ్చు. ధైర్య సాహసాలు పెరుగుతాయి. రిస్క్ కూడుకున్న పనుల్లో లాభాలు ఉంటాయి. కష్టపడి ఏ పని చేసినా మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగం చేసేచోట లేదా వ్యాపారం చేసే ప్రాంతంలో ఇతరుల సహకారం లభిస్తుంది. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్ధికంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

కన్యా రాశి జాతకులకు కేతువు గోచారం కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్థులు పూర్తిగా నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే కెరీర్ అభివృద్ధిపధంలో సాగుతుంది. ఈ రాశి జాతకులపై కేతువు గోచారం గణనీయంగానే ప్రభావం చూపించనుంది. ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉంటే మంచి లాభాలు కలగవచ్చు. ఆర్ధికంగా స్థితిమంతులు కాకపోయినా ఇబ్బందులు ఎదురుకావు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. 

కర్కాటక రాశి జాతకులకు కేతువు గోచారం ప్రభావంతో 18 నెలల వరకూ అంతా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఇబ్బందులు ఉన్నా ఎదుర్కొనే సామర్ధ్యం కలిగి ఉండాలి. పనిచేసేచోట అనువైన వాతావరణం ఉంటుంది. ప్రత్యర్ధులు మిమ్మల్ని ఎదుర్కోలేరు. తోటి ఉద్యోగులు, సిబ్బందికి ఎప్పుడూ స్నేహపూర్వకంగా మద్దతు ఇస్తూ ఉండాలి. అప్పుడే మీకు గౌరవం లభిస్తుంది. చేసే ప్రతి పనిలో పూర్తి ఎనర్జీ లభిస్తుంది. ఆర్దికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఎదురుకావు.

Also read: Karwa Chauth 2023: ఈ వ్రతం ఉండాలంటే ముందు ఈ సూచనలు పాటించాల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News