Ketu Transit 2023: రివర్స్‌లో కదులుతున్న కేతువు... ఇక ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Ketu Transit In Kanya:  వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, కేతు గ్రహం కన్యారాశిలో సంచరించబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2023, 04:29 PM IST
Ketu Transit 2023: రివర్స్‌లో కదులుతున్న కేతువు... ఇక ఈ 3 రాశులవారు  పట్టిందల్లా బంగారమే..

Ketu Transit In Kanya: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కదలికలో మార్పు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రాహు, కేతువులను ఛాయా గ్రహాలుగా పిలుస్తారు. ఈ ఏడాది కేతు గ్రహం శుక్రుని రాశిని విడిచిపెట్టి బుధుడు రాశి అయిన కన్యారాశిలోకి ప్రవేశించనుంది. కేతు గ్రహం ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 18 నెలలు పడుతుంది. అందుకే కేతువు సంచారం అన్ని రాశులనూ ప్రభావితం చేస్తుంది. అయితే కేతు సంచారం కొందరికి బంఫర్ ప్రయోజనాలను అందించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

కేతు సంచారం ఈ రాశులకు అదృష్టం
మకర రాశిచక్రం
కేతువు సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వ్యాపారంలో పురోగతికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార నిమిత్తం మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది.
సింహ రాశి
కేతు గ్రహం యొక్క రాశి మార్పు సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. విదేశీ వ్యాపారం చేసేవారు లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. మీలో ధైర్యం పెరుగుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 
వృషభ రాశి
కేతువు సంచారం మీకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆఫీసులో మీకు అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా మెరుగుపడతారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 

Also Read: Guru Margi 2023: బృహస్పతి తిరోగమనం.. ఏప్రిల్ 21 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News