Kamika Ekadashi 2022 Date: శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశికి (Kamika Ekadashi 2022) చాలా విశిష్టత ఉంటుంది. ఈ వ్రతం చేసేటప్పుడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. అన్ని ఏకాదశుల్లోకెల్లా ఈ ఉపవాసం చాలా కష్టమైనది. ఏకాదశి యొక్క వక్ర పదవ రోజు నుండి ప్రారంభమై ద్వాదశి రోజున ముగుస్తుంది. ఈ సమయంలో చేసే పూజలు, పరిహారాల వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈసారి కామికా ఏకాదశి జూలై 24న వస్తోంది. ఈ ఏకాదశి వ్రతం పాటిస్తే మీ పాపాల నుండి విముక్తి పొందుతారు. కామిక ఏకాదశి నాడు ఈ చర్యలు తీసుకుంటే..మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు.
కామిక ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేయండి
>> మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా, సంపద పెరగాలన్నా కామిక ఏకాదశి రోజున పసుపు గుడ్డను తీసుకుని అందులో పసుపు ముద్ద, బియ్యం, వెండి నాణెం వేసి ఒక కట్టగా కట్టి..విష్ణువు పాదాల వద్ద పెట్టండి. కాసేపు అక్కడే ఉంచి.. తర్వాత ఆ కట్టను తీసి భద్రంగా ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది.
>> తులసి మరియు ఏకాదశి వ్రతం రెండూ విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. ఏకాదశి రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగించండి. అలాగే, తులసి నమాష్టకం చదువుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ఏకాదశి నాడు తులసికి నీరు సమర్పించకూడదనే విషయాన్ని గుర్తించుకోండి. వీలైతే ఈ రోజున తులసి వ్రతం పాటించండి.
>> కామికా ఏకాదశి రోజున శ్రీ హరికి పసుపు వస్త్రాలు, పసుపు పండ్లు, పసుపు మిఠాయిలు మొదలైనవి సమర్పించండి. దీనితో పాటు, ఏదైనా విష్ణు దేవాలయంలో కుంకుమ బొట్టును సమర్పించండి. ఒక బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి అతనికి భోజనం పెట్టండి. పసుపు బట్టలు ఇవ్వండి. ఈ చర్యలన్నీ చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి.
>> కెరీర్‌లో పురోగతిని సాధించడానికి...ముందుగా 11 రావి ఆకులను శుభ్రమైన నీటితో కడగండి. తర్వాత ఆ ఆకులపై పసుపు లేదా కుంకుమతో 'శ్రీ' అని వ్రాసి ఒక దండను తయారు చేయండి. ఈ మాలను విష్ణుమూర్తికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల డబ్బు, వృత్తి, ఉద్యోగానికి సంబంధించిన మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
>> ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి...తర్వాత ఆవు పాలలో కుంకుమ కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తే శ్రీహరి ఎంతో సంతోషించి భక్తుల కోరికలన్నంటినీ నెరవేరుస్తాడు.
Also Read: LakshmiDevi: లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook