Jupiter Transit 2022: మీన రాశిలోకి బృహస్పతి సంచారం.. నవంబర్ 24 నుంచి ఈ ఐదు రాశుల వారికి డబ్బేడబ్బు!

Jupiter Transit in Pisces on november 24. నవంబర్ 24 సాయంత్రం 4 గంటల 27వ నిమిషంలో మీన రాశిలో బృహస్పతి తిరోగమనంలో ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 14, 2022, 01:44 PM IST
  • మీన రాశిలోకి బృహస్పతి సంచారం
  • నవంబర్ 24 నుంచి ఈ ఐదు రాశుల వారికి డబ్బేడబ్బు
  • మీన రాశిలో బృహస్పతి తిరోగమనం
Jupiter Transit 2022: మీన రాశిలోకి బృహస్పతి సంచారం.. నవంబర్ 24 నుంచి ఈ ఐదు రాశుల వారికి డబ్బేడబ్బు!

Jupiter Transit in Pisces on november 24: జ్యోతిష్యశాస్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తమ రాశిన చక్రాన్ని మార్చుతుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మీన రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తుంది. నవంబర్ 24 సాయంత్రం 4 గంటల 27వ నిమిషంలో మీన రాశిలో బృహస్పతి తిరోగమనంలో ఉంటుంది. బృహస్పతి సంచారం శుభ ఫలితాలను మరియు ప్రయోజనాలను ఇస్తుంది. బృహస్పతి రాశి మారడం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు ఓసారి చూద్దాం.

వృషభ రాశి:
వృషభ రాశి 11వ స్థానంలోకి బృహస్పతి వస్తాడు. దాంతో వృషభ రాశి వారికి తమ వృత్తి జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీ తోబుట్టువులతో సంబంధం బాగుంటుంది. ఉద్యోగస్తులు తమ వృత్తిలో మంచి పురోగతిని సాధిస్తారు,. పని చేసే ప్రాంతంలో సహోద్యోగులు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈ సమయం వ్యాపారంకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి:
కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి సంచరిస్తాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి వివిధ రంగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కెరీర్‌లో మీ గ్రాఫ్ పైకి వెళుతుంది. విదేశాలలో పని చేయాలనుకునే వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలం. కుటుంబ సభ్యులతో మీ బంధం చాలా బాగుంటుంది.

కన్య రాశి:
కన్య రాశిలో ఏడవ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశించబోతున్నాడు. దాంతో కన్య రాశి వారు వృత్తిపరమైన మరియు సామాజిక జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా లేదా వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నా ఇదే మంచి సమయం. పెట్టుబడి కూడా పెట్టవచ్చు. భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అధిక ధన లాభం ఉంది. 

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశిలో ఐదవ ఇంట్లోకి బృహస్పతి ప్రవేశించబోతున్నాడు. ఉద్యోగం మారాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాచుకోవడానికి అనుకూల సమయం. విదేశాలకు వెళ్లే వారికీ అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిష్టితి మెరుగవుతుంది. 

కుంభ రాశి:
కుంభ రాశి రెండవ స్థానంలో బృహస్పతి ఉండనున్నాడు. మీరు ఇంతకుముందు చేసిన కృషికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. కార్యాలయంలో మీ కృషిని అధికారులు మెచ్చుకుంటారు, ప్రమోషన్ లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అధిక ధన లాభం ఉంది. 

Also Read: ICC Team: ఐసీసీ అత్యుత్తమ టీమ్.. భారత్ నుంచి ఇద్దరి చోటు!

Also Read: Vijay Hazare Trophy: ఆసుపత్రిపాలైన యంగ్ క్రికెటర్.. నొప్పితో విలవిల  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News