Jupiter Rahu Conjunction: 36 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ రాశులపై డబ్బు వర్షమే ఇక..

Guru Gochar 2023: రీసెంట్ గా దేవగురు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా రాహు-గురువుల మైత్రి ఏర్పడింది. ఇది ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 25, 2023, 08:08 AM IST
Jupiter Rahu Conjunction: 36 ఏళ్ల తర్వాత మేషరాశిలో అరుదైన కలయిక.. ఈ రాశులపై డబ్బు వర్షమే ఇక..

Guru Rahu Yuti 2023: జ్యోతిషశాస్త్రంలో అదృష్టానికి మరియు సంపదకు కారకుడిగా బృహస్పతిని భావిస్తారు. జాతకంలో గురు గ్రహం శుభప్రదంగా ఉన్న వ్యక్తి వైవాహిక సుఖాన్ని పొందుతాడు. పుష్కర కాలం తర్వాత గురుడు మేషరాశి ప్రవేశం చేశాడు. ఇప్పటికే అదే రాశిలో దుష్ట గ్రహమైన రాహువు సంచరిస్తున్నాడు. మేష రాశిలో బృహస్పతి మరియు రాహువు కలయిక ఏర్పడుతుంది. 36 ఏళ్ల తర్వాత వీరి సంయోగం జరుగుతుంది. మేషరాశిలో గురుడు రాహు మైత్రి ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 

మేషం- ఇదే రాశిలో గురు రాహువుల కూటమి ఏర్పడబోతుంది. దీంతో ఈ రాశివారు భారీగానే ప్రయోజనం పొందబోతున్నారు. వీరి ఆరోగ్యం బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సంతానప్రాప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక పనులపై ఆసక్తి పెరుగుతుంది. 
మిథునరాశి- గురు రాహువు కలయిక మిథున రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
కర్కాటకం- కర్కాటక రాశి వారికి గురు రాహువు కలయిక అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. మీకు కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది.  

Also Read: Surya Gochar 2023: రాబోయే 20 రోజులు ఈ రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?

ధనుస్సు- బృహస్పతి మరియు రాహులు సంయోగం ధనుస్సు రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. కెరీర్‌ మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లవిరిస్తుంది. 
తులారాశి-రాహు-గురువుల సఖ్యత మీ జీవితంలో సమస్యలన్నింటినీ తొలగిస్తుంది. మీ కెరీర్ లో ఆటంకాలు రావు. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. 
మీనం- ఈ రాశి వారికి రాహువు మరియు గురువులు అనేక ప్రయోజనాలు అందించబోతున్నారు. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 

Also Read: Gajlaxmi Rajyog effect: మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం.. ఈ రాశులకు పట్టనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News