Jupiter Uday 2023: 12 నెలల తర్వాత ఉదయించబోతున్న గురుడు... వీరికి బిజినెస్ లో లాభాలే లాభాలు..

Jupiter Uday 2023: వేద పంచాంగం ప్రకారం, బృహస్పతి మీన రాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా 3 రాశుల వారు వృత్తి, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2023, 09:07 AM IST
Jupiter Uday 2023: 12 నెలల తర్వాత ఉదయించబోతున్న గురుడు... వీరికి బిజినెస్ లో లాభాలే లాభాలు..

Jupiter Uday 2023: గ్రహాలు కాలానుగుణంగా అస్తమిస్తూ, ఉదయిస్తూ ఉంటాయి. ఒక గ్రహం అస్తమించినప్పుడల్లా దాని శక్తులు ముగుస్తాయి. అయితే ఫ్లానెట్ ఉదయించినప్పుడు అది పూర్తి ఫలితాలను ఇస్తుంది. దేవతల గురువైన బృహస్పతి ఏప్రిల్ ప్రారంభంలో ఉదయించబోతున్నాడు. దీని ప్రభావం (Jupiter Rise 2023) ప్రజలందరిపై ఉంటుంది. దీంతో మూడు రాశుల వారి సంపదలో రెట్టంపు పెరుగుదల ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మీన రాశిచక్రం (Pisces): మీనరాశిలో బృహస్పతి ఉదయించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి లగ్న గృహంలో ప్రయాణిస్తున్నాడు. దీంతో మీలో ధైర్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో మీరు బలపడతారు. వ్యాపారంలో రెట్టింపు లాభం ఉంటుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు విజయం ఉంటుంది. 

మిథునం (Gemini): దేవతల గురువైన బృహస్పతి ఉదయించడం మిథునరాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి 10వ స్థానంలో ఉదయిస్తాడు. దీంతో మీరు బిజినెస్ లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కెరీర్ లో అపారమైన పురోగతి ఉంటుంది.  మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్సఫర్ అవుతారు. మీరు మీ  పనిని అంకితభావంతో పూర్తిచేస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. 

తులా రాశిచక్రం (Libra): బృహస్పతి ఉదయించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ సంచార జాతకంలో ఆరో ఇంట్లో జరగబోతుంది. మీ శత్రువులు నాశనమవుతారు. వ్యాధి నుండి బయటపడతారు. అప్పును మీరు తిరిగి చెల్లిస్తారు. మీరు ఇల్లు లేదా భూమిని కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Busniess Yog: మీ జాతకంలో ఈ యోగం ఉంటే చాలా అదృష్టవంతులు.. మీరు వ్యాపారంలో డబ్బుతోపాటు కీర్తిని గడిస్తారు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U      

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News