Navpancham Rajyog: 12 ఏళ్ల తరువాత 'నవ పంచమ రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి ధనలాభం...

Navpancham Rajyog: ఆస్ట్రాలజీ ప్రకారం, గురుడు మరియు శుక్రుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మూడు రాశులవారికి మంచి లాభాలను పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2022, 04:13 PM IST
Navpancham Rajyog: 12 ఏళ్ల తరువాత 'నవ పంచమ రాజయోగం'.. ఈ 3 రాశుల వారికి ధనలాభం...

Navpancham Rajyog: వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడు లేదా ఏదైనా ఇతర గ్రహంతో కలిసినప్పుడు అది రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. బృహస్పతి మరియు శుక్రుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని (Navpancham Rajyog) ఏర్పరుస్తున్నారు. కాబట్టి దీని ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. దీని ప్రభావం మూడు రాశులవారిపై కనిపిస్తుంది. వీరు కెరీర్ లో పురోగతిపాటు అపారమైన ధనాన్ని పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం (Gemini): నవపంచం రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీరు కొత్త జాబ్ సాధించే అవకాశం ఉంది. మీ ధైర్యం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీరు దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

వృషభం (Taurus): నవపంచం రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలలో మంచి డబ్బు సంపాదించవచ్చు. మీర విదేశీ వ్యాపారం చేయడం ద్వారా లాభపడతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయాల్లో మీరు పదవి పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 

కర్కాటకం (Cancer): నవపంచం రాజయోగం మీకు చాలా మేలు చేస్తుంది. మీరు అదృష్టంతో ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. పాత పెట్టుబడి ద్వారా లాభాలను పొందుతారు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

Also Read: Budh Gochar 2022: బుధుడి రాశి మార్పు.. రేపటి నుండి ఈ 4 రాశులకు దశ తిరగనుంది.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News