January Horoscope 2023: కొత్త సంవత్సరం ప్రారంభమై 12 రోజులు కావొస్తుంది. అయితే చాలా మంది వారి భవిష్యత్ జీవితాల్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. దీని కోసం ప్రతి వారం వారి రాశి ఫలాలను చెక్ చేసుకుంటూ.. జాతకాన్ని జ్యోతిష్యు శాస్త్ర నిపుణులకు చూపిస్తారు. అయితే ఈ వారం ఏయే రాశువారు బలహీనంగా ఉండబోతున్నారు. ఇంతకీ కింద పేర్కొన్న రాశువారిపై ఎలాంటి ప్రభావం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశువారికి వచ్చే వారం, ఈ వారం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం..
>>మేష రాశి వారు కర్మ ఫలితాలను బట్టి జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అయితే ఈ క్రమంలో అస్సలు తొందర పడి నిర్ణయాలు తీసుకోవద్దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా ఈ రాశువారు వారం పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>వృషభ రాశి వారు ఈ వారం మంచి ప్రయోజనాలే పొందే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు కొన్ని వినోద కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ క్రమంలో ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. ఓవరాల్ గా ఈ వారం అతనికి చాలా బాగుంటుంది.
>>మిథున రాశి వారికి ఈ వారం అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇది మంచి సమయంగా భావించవచ్చు.
>>కర్కాటక రాశి వారు ఈ వారం ఎలాంటి పనులు చేసిన విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఈ క్రమంలో కష్టపడి పనులు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఈ వారం మీ కుటుంబం మద్దతు లభించి ఊహించని ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
>>సింహ రాశి వారు ఈ వారం తొందర పడి ఎలాంటి పనులు చేయకూడదు. సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులతో సంబంధాలు క్షీణించే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
>>కన్యా రాశి వారికి ఈ వారం బాగానే ఉంటుంది. కొత్త ఆలోచనలతో మీ యజమానిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరించే సూచనలున్నాయి. ఈ వారం మొత్తం మీరు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
Also Read: Thunivu Twitter Review : అజిత్ తెగింపు ట్విట్టర్ రివ్యూ.. డబ్బులు వేస్ట్ అయ్యాయట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి