Astro Tips: ఈ 5 చెట్లను పూజిస్తే.. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు!

Astro Tips: హిందూ మతంలో మెుక్కలకు చాలా ప్రాధాన్యత ఉంది. వీటిలో కొన్ని మెుక్కలను పవిత్రమైనవిగా భావించి పూజిస్తారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 3, 2022, 09:30 AM IST
Astro Tips: ఈ 5 చెట్లను పూజిస్తే.. మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు!

Astro Tips: హిందువులు కొన్ని చెట్లను పవిత్రమైనవిగా భావిస్తారు. వీటిని దేవతమూర్తుల ప్రతిరూపాలుగా కొలుస్తారు. ఈ మెుక్కలను పూజించడం వల్ల ఆ వ్యక్తికి దీర్ఘాయువుతోపాటు అపారమైన డబ్బు లభిస్తుంది. ఈ చెట్లను ఆరాధించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి పవిత్రమైన 5 మెుక్కలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

రావి చెట్టు (Peepal Tree): హిందూమతంలో రావిచెట్టును చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టులో విష్ణువు కొలువుంటాడని నమ్ముతారు. ఈ చెట్టును పూజించడం వల్ల కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చు. గ్రంథాల ప్రకారం, రావిచెట్టు మెుదళ్లలో విష్ణువు, కాండంలో కేశవ, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీ హరి మరియు పండ్లలో సకల దేవతలతోపాటు అచ్యుత్ దేవుడు ఉంటాడని నమ్ముతారు. మీరు ప్రతిరోజూ పీపాల్‌ చెట్టుకు నీరుపోసి పూజిస్తే అనేక వ్యాధుల నుండి బయటపడతారు. 

మర్రి చెట్టు: రావిచెట్టు తర్వాత అత్యంత పూజనీయమైన చెట్టు మర్రి. ఇందులో త్రిమూర్తులు నివాసం ఉంటారని నమ్ముతారు. వట సావత్రి పండుగ రోజు మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఈ చెట్టును పూజిస్తారు. 

బిల్వ మెుక్క: హిందువులు ఆరాధించే మెుక్కలలో బిల్వ చెట్టు ఒకటి. బిల్వపత్రం శివునికి చాలా ప్రీతికరమైనది. బిల్వ పత్రం లేకుండా శివుని ఆరాధన సంపూర్ణం కాదు. తల్లి లక్ష్మి ఈ చెట్టు వేరులో నివసిస్తుందని నమ్ముతారు.

ఉసిరి మెుక్క: హిందూమతంలో ఉసిరి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది. దీని గురించి పద్మ పురాణంలో చెప్పబడింది. ఈ చెట్టు కింద కూర్చుని శివ, విష్ణు, లక్ష్మి అమ్మవారిని పూజిస్తే..ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పేదలకు, బ్రాహ్మణులకు ఉసిరి దానం చేయడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. 

వేప చెట్టు: హిందువులు వేపచెట్టును దుర్గాదేవి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ మెుక్క వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేపచెట్టును పూజించడం వల్ల మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అనేక రోగాలు దూరమవుతాయి. వేప ఆకుల పొగ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. 

Also Read: Deepawali 2022: ఈ సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా? 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News