Horoscope Today July 7th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ కొన్ని రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలిసొస్తుంది. ఒకటి, రెండు రాశుల వారికి చంద్ర అనుగ్రహం ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు తప్పవు. సంతానం కోసం ఎదురుచూసే రెండు రాశుల దంపతులకు ఇవాళ శుభవార్త ఉండొచ్చు. ఇంకా నేటి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి (Aries)
చంద్ర అనుగ్రహం మీపై ఉంటుంది. గందరగోళ పరిస్థితులు అదుపులోకి వస్తాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సి వస్తుంది. మీ కొలిగ్స్ మీ అభిప్రాయాలతో విబేధిస్తే దాన్ని అంగీకరించండి. టీమ్ వర్క్‌తోనే సక్సెస్ సాధిస్తారు. బిజీ షెడ్యూల్లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. తగినంత విశ్రాంతికి ప్రాధాన్యమివ్వండి. సున్నితమైన ఆర్థిక సమస్యలను జాగ్రత్తగా డీల్ చేయండి.
వృషభ రాశి (Taurus)
ఉద్యోగ విషయంలో శుభవార్త అందే అవకాశం ఉంది. కెరీర్లో మరింత పురోగతి కోసం ఉన్నత విద్య అభ్యసించేందుకు ప్లాన్ చేస్తారు. కొన్ని మోటివేషనల్ ఈవెంట్స్‌తో బిజీగా గడుపుతారు. వివాహ విషయంలో అవివాహితులకు శుభవార్త అందవచ్చు. సంతానం కోసే ఎదురుచూసే దంపతులకు శుభవార్త ఉండొచ్చు.
మిథున రాశి (GEMINI)
ప్రస్తుతం ఉంటున్న చోటు నుంచి మరో చోటుకు ఇల్లు మారే ప్రయత్నాలు చేస్తారు.కానీ ప్రస్తుతానికి ఆ ప్రయత్నాలు మానుకుంటే మంచిది. పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఈరోజు సాయంత్రానికి పరిస్థితులన్నీ అదుపులోకి వస్తాయి. పెద్దల సలహాతో కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు.
కర్కాటక రాశి (Cancer)
ప్రభావశీలురైన ఓ వ్యక్తిని కలుస్తారు. అతని మాటలు మీపై చాలా ప్రభావం చూపుతాయి. మీ వ్యాపార పురోగతికి అతని సలహాలు తోడ్పడుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇవాళ ఓపిక అవసరం. అలా అయితేనే మీరు అనుకున్న ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయగలరు. ఉద్యోగ రీత్యా షార్ట్ ట్రిప్స్ ఉండే అవకాశం ఉంది. ఏకాగ్రత పెరిగేందుకు ధ్యానం చేయడం మంచి మార్గం.
సింహ రాశి (LEO)
మీ ఇంటి కోసం సృజనాత్మక కళాకృతులు కొనుగోలు చేస్తారు. ఇంటి మరమత్తులు చేపట్టే అవకాశం ఉంది. ఫ్యామిలీ బిజినెస్‌లో కొత్త స్ట్రాటజీలు అమలుచేస్తారు. అవి వర్కౌట్ అయి సమీప భవిష్యత్తులో మీకు లాభాలు తీసుకొస్తాయి. ఫ్యామిలీ లేదా సోషల్ గెట్ టు గెదర్‌కు హాజరయ్యే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
ఇవాళ మీకు శుభదినం. ఆరోగ్యపరంగా, తేజస్సుపరంగా అంతా బాగుంటుంది. చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. అయితే ముక్కుసూటితనం మీకు కొన్ని ఇబ్బందులు తీసుకురావొచ్చు. అనవసర విషయాలపై చర్చలకు దూరంగా ఉండటం మంచిది. లేనిపక్షంలో చిన్న చిన్న విషయాలకు గొడవలు జరగవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది. ప్రేమ పక్షులు అర్థం పర్థం లేని విషయాలపై చర్చించి విభేదాలు తెచ్చుకోవద్దు.
తులా రాశి (Libra)
చంద్ర అనుగ్రహం ఉన్నప్పటికీ అసంతృప్తి వెంటాడుతుంది. ఓపిక నశిస్తుంది. మీకు అప్పగించిన లేదా చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు ఉండవు. దీంతో ఆ పనులు పూర్తి చేయాలనే ఆసక్తి కూడా పోతుంది. అయితే మీదైన రోజున ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసం మీకు అవసరమని గుర్తించండి. సంకల్ప బలంతో ముందుకు సాగండి.
వృశ్చిక రాశి (Scorpio)
చంద్ర అనుగ్రహం లభిస్తుంది. పని భారం కొంతమేర తగ్గుతుంది. మీ సంపాదనలో కొంత భాగం పెట్టుబడిగా మారితే అది మీకు లాభాలు తీసుకొస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల పట్ల మీరు ఆసక్తి చూపుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి విదేశీ ఆర్డర్ ఒకటి వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా అది మిమ్మల్ని మంచి స్థానంలో నిలబెడుతుంది. మీ సోల్‌మేట్‌ని కలుసుకుంటారు. విద్యార్థులకు అకడిమక్ పరంగా గుడ్ న్యూస్ అందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius)
చంద్ర అనుగ్రహంతో వృత్తిరీత్యా బాగా రాణించగలరు. మీ వ్యాపార భాగస్వాముల సహాయంతో కొత్త ప్లాన్స్‌ను సులువుగా అమలుచేయగలరు. మేదోపరమైన, ఆర్థికపరమైన పెట్టుబడులు లాభిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలతో సమయం గడిపేందుకు ఇష్టపడుతారు.
మకర రాశి (Capricorn)
చంద్ర అనుగ్రహం లభిస్తుంది. మీలోని ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని మరింత సంతోషంగా ఉంచుతుంది. మీ ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్లాన్ చేస్తారు. మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తులతోనే మీ ఆలోచనలు పంచుకోండి. లేనిపక్షంలో కుట్రలకు బాధితులుగా మిగిలిపోతారు.
కుంభ రాశి (Aquarius)
ఇవాళ నిరాశజనకంగా ఉంటుంది. ఓపిక నశిస్తుంది. మనశ్శాంతి కరువవుతుంది. ముఖ్య విషయాల్లో మీ అంతరాత్మ చెప్పేదే వినండి. ధ్యానం, దైవ మంత్రం ద్వారా కాస్త ఉపశమనం పొందవచ్చు. ఏదేని సబ్జెక్టులో మంచి నాలెడ్జి పొందాలంటే కష్టపడి చదవండి. ఇతరులు మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసినా మీ దృష్టి మరల్చవద్దు.
మీన రాశి (Pisces)
చంద్ర అనుగ్రహంతో మీ అంతరంగ బలం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సమీప భవిష్యత్తులో వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. సంతానం విషయంలో దంపతులకు శుభవార్త ఉంటుంది. ప్రేమికులు మనస్పర్థలకు తావు లేకుండా ఉండాలంటే ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోవాలి.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్డేట్స్
Also Read: Chandrababu on CM Jagan: అమ్మ ఒడి బూటకం..ఇంగ్లీష్ మీడియం నాటకం..జగన్‌పై చంద్రబాబు ధ్వజం..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook