Horoscope Today 25 June 2021: మేష రాశి
హేతుబద్ధతతో వ్యవహరించడం ద్వారా ఈరోజు కొన్ని ప్రయత్నాలు సఫలం కావు. కుటుంబానికి సంబంధించిన పనులలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులు కుటుంబం నుంచి వీడిపోవాలని భావిస్తున్నారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు భారం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.
వృషభ రాశి
ఈ రోజు కొన్ని మార్పులు సంభవిస్తాయి. వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇది మీ వాస్తవ దృక్పథానికి అద్దం పట్టకపోవచ్చు. ప్రస్తుతం ఎవరూ మీ మాట వినే అవకాశాలు కనిపించడం లేదు, కనుక మరికొంత కాలం వేచి చూడటం ఉత్తమం. కుటుంబంలో కలతలు వస్తాయి. కొందరు వ్యక్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
మీతో ఉన్నదానితో సంబంధం లేకుండా, గౌరవప్రదంగా ఉండటానికి మరో పనిని ప్రారంభిస్తారు. ప్రమాదం ఉందని తెలిసిన వాటిలో జోక్యం చేసుకోవడం నేడు అంత క్షేమదాయకం కాదు. ఒక సహచరుడు తమ లాభం కోసం చేయకూడని పనులపై ధ్యాస పెడతారు. ఉద్యోగులకు పరిస్థితులు కలిసొస్తాయి.
కర్కాటక రాశి
మీరు ఇతరుల గురించి ఆలోచిస్తారు. మీ భావోద్వేగాలతో పరిస్థితి అస్పష్టంగా మారుతుంది. మీ జీవిత భాగస్వాములలో ఏ విషయంలోనూ గొడవ పడకూడదు. ఈ రోజు పనులు పూర్తి చేయకపోతే జరిగే నష్టం లేదని గ్రహించి వ్యవహరించాలి. ఉద్యోగులు తమకు పనిలో ప్రతిఫలం కావాలని ఆశిస్తారు.
సింహ రాశి
విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచిస్తారు. మీరు అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తున్న విషయాలకు మరింత సమయం కేటాయించాలని ఆలోచనలు. కొన్ని విషయాలు ఈ రాశివారికి నేడు చికాకు తెప్పిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయాలి. వ్యాపారులు పెట్టుబడి విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
Also Read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?
కన్య రాశి
మీ ఆదాయానికి మించి చేసే ఖర్చులతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. దాంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పని భారం అధికం అవుతుంది. ప్రయాణాలు చేయడంతో కుటుంబసభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయి.
తులా రాశి
కొందరు మిమ్మల్ని కలుసుకుని చమత్కారం చేసే కథలు చెబుతారు. అలాంటి వాటికి దూరంగా ఉంటూ మీ పనులు చక్కబెట్టుకుంటేనే మీకు ప్రయోజనం. నేడు వీరికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. అనుమానిత వ్యక్తుల సలహాలు పాటించకూడదు. వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది.
వృశ్చిక రాశి
కొన్ని చేయకూడని, అపవిత్రమైన పనులలో పాల్గొనే అవకాశాలున్నాయి. మీరు ఏం చేస్తున్నారో చుట్టుపక్కల వారు గమనిస్తున్నారని మాత్రం మరచిపోవద్దు. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది. కష్టానికి తగిన ఫలితం వస్తుందని ఆశిస్తున్నారు. కొంత సమయం వేచి చూడాల్సి ఉంటుంది.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
ధనుస్సు రాశి
హేతుబద్ధత మరియు నిజాయితీతో వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. మీ మనోభావాలు కొందరికి అంతరాయం కలిగిస్తాయని మీరు గ్రహిస్తారు. నేడు వాహనాలు లేదా ఏవైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానం అందుతుంది.
మకర రాశి
ఈ రోజు ఊహించని వ్యక్తి మీ ఇంటిని సందర్శించవచ్చు. ఏదో ఆశించి మిమ్మల్ని కలుసుకున్నారని గ్రహించకపోతే అనర్థాలు తప్పవు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శ్రమకు తగిన ఫలితం రావడంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితాన్ని పొందే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
మీరు నేడు చాలా ఒత్తిడికి లోనవుతారు. కుటుంబానికి సమయాన్ని వెచ్చిస్తారు. పని నుంచి కొంత విరామం తీసుకుని కుటుంబం, భవిష్యత్ కార్యాచరణపై ఆలోచిస్తారు. ఇటీవల జరిగిన వివాదాలను పరిష్కరించుకుంటారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మీన రాశి
మీరు అనవసరమైన వస్తువులు కొంటున్నారా, అయితే మీకు ఆర్థిక సమస్య తలెత్తే సూచన కనిపిస్తుంది. రుణాల కోసం యత్నించకుండ ఉండటానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook