Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today In Telugu 18 July 2021: ఈరోజు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవద్దు.  స్పష్టంగా ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందర పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2021, 08:05 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 18 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 18 July 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 18వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈరు తెలుసుకున్న విషయాలను విశ్లేషించండి. మీరు ఒక ఒప్పందంపై సంతకం చేయవలసి వస్తే లేదా చట్టపరమైన పనులు ఏదైనా చేయవలసి వస్తే, మీ స్నేహితులు, బంధువులు ఉత్తమ ఉద్దేశాలను కలిగి ఉండకపోవచ్చు. మిమ్మల్ని మీరు కాపాడుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పనిలో గుర్తింపు లభిస్తుంది.

వృషభ రాశి
మీ కెరీర్ మరియు మీ వ్యక్తిగత జీవితం మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. కెరీర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వినోదాలను పక్కన పెట్టి మీకు నిర్దేశించిన లక్ష్యాలపై దృష్టి పెట్టవలసిన సమయం ఇది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.

Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు

మిథున రాశి
మీ కెరీర్ సరైనదో కాదోనని పునరాలోచించడానికి ఇది మంచి రోజు. సమస్య తలెత్తితే కొంత సమయం కేటాయించి మీ నిర్ణయాలను తీసుకోవాలి. డబ్బు వెనుక పరుగెత్తడం ద్వారా చాలా కోల్పోతారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఆ పని, కెరీర్ కోసం పరుగులు తీయాలని నిర్ణయించుకుంటారు. మీ పనిని ఇష్టపడి చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది.

కర్కాటక రాశి
ఏదైనా ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాలకు ఆలస్యం చేయకుండా వెళతారు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఒకటికి రెండు పర్యాయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాశివారికి నేడు ఆకస్మిక ధనవ్యయం గోచరిస్తుంది. 

సింహ రాశి
మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధాలు పెంచుకోవడం ద్వారా వృద్ధి చెందడానికి అవకాశాలు లభిస్తాయి. మిమ్మల్ని మీరు యజమానిగా భావించవద్దు. స్నేహితులు, బంధువులను గౌరవించడం మొదలుపెడతారు. పనిచేసే చోట విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ సహోద్యోగులతో చివరి వరకు ఉండి పేరు తెచ్చుకుంటారు. 

Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్

కన్య రాశి
ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం ఉంది. కానీ ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. స్నేహితులతో చేపట్టాలనుకున్న పని ఎట్టకేలకు ప్రారంభిస్తారు. పని కోసం కొంత సమయం కేటాయించి ముందుకు సాగండి. కొత్త ప్రదేశాలను వెళ్లడం మీకు అలవాటుగా మారుతుంది. 

తులా రాశి
గత కొంతకాలం నుంచి మీరు పనులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈరోజు సెలవు దొరకడంతో కుటుంబంతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులను వారి యజమాని అనుకోకుండా పని కోసం మిమ్మల్ని పిలుస్తారు. పని చేయడం ద్వారా భవిష్యత్తులో మేలు జరుగుతుంది. లేదా అందుకు తగిన బహుమతి లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు. 

వృశ్చిక రాశి 
మీరు కొంతకాలం నుంచి ఏ పని లేకుండా సరదాగా గడుపుతున్నారు.  మీ దీర్ఘకాలిక లక్ష్యాలను మర్చిపోవద్దు. లేనిపక్షంలో మీరు కోరుకున్నవి కోల్పోవాల్సి వస్తుంది. ఆర్థిక కారణాలతో చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. కొంత ఒత్తిడి కారణంగా ప్రయాణాలు చేయాలని భావిస్తారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు.

Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే

ధనుస్సు రాశి
మీరు గత కొంతకాలం నుంచి ఒంటరిగా ఉంటున్నారు. మీతో సరదాగా గడపాలని, మీతో పలు విషయాలు మాట్లాడాలని కుటుంబం మరియు స్నేహితులు ఆశిస్తున్నారని మర్చిపోవద్దు. వ్యాపారులు గతంలో చేసిన పెట్టుబడులకు లాభాలు అందుకుంటారు. పరిస్థితులు కలిసి రావడంతో మీపై ఒత్తిడి తగ్గుతుంది.

మకర రాశి
మీరు ఈ రోజు ఓ విషయంలో వివాదాల బారిన పడతారు. మరోవైపు మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరికైనా ఏదైనా చెప్పాలని భావించినట్లయితే ఈ రోజు అందుకు తగిన సమయం. ప్రతి విషయాన్ని లోపల దాచుకుంటే మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కుంభ రాశి
ఈరోజు ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవద్దు.  స్పష్టంగా ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవాల్సి ఉంటుంది. తొందర పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగుల పని బారం అధికం కానుంది.

మీన రాశి
చాలా కాలం నుంచి మీ దృష్టి టెక్నాలజీపై ఉంది. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌ను పక్కన పెట్టి, మీ చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. సాంకేతికత కోసం మీ ప్రస్తుత పనులను వదులుకోవడం వల్ల సమస్యలు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారులు ఆశించిన ఫలితాలు అందుకోలేరు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News