Horoscope Today 16 July 2021: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి ఓ ప్రత్యేక లక్షణం ఉంటుంది. శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 16వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
పని పరంగా కొత్త విషయాలు మీ దారిలోకి వస్తాయి. ఏ మాత్రం సంకోచించకుండా నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థులు నూతన కోర్సులలో ప్రవేశాలు పొందుతారు. కొత్త అభిరుచిని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. తద్వారా మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఉద్యోగం మారాలనుకుంటే నేటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చు.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
వృషభ రాశి
నేటి ఉదయం కాస్త నెమ్మదిగా పనులు ప్రారంభిస్తారు. రాత్రిలోగా శుభవార్తలు అందుకుంటారు. మీరు సృజనాత్మకత విషయాలతో ఆకట్టుకుంటారు. ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారాలలో మార్పులు చేయాలనుకుంటే, అలా చేయడానికి మంచి రోజు. కొంత సమయం ఒంటరిగా గడపండి.
మిథున రాశి
ప్రయాణాల కారణంగా కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీరు పనిలో ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి.
కర్కాటక రాశి
ఈ రాశివారికి నేడు కొన్ని విషయాలలో కలిసొస్తుంది. విద్యార్థులకు పరీక్షలలో మంచి ఫలితాలు. బంధువుల నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. స్వేచ్ఛగా పని చేయడానికి అవకాశం దొరుకుతుంది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు ఇది తగిన సమయం.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
సింహ రాశి
నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. నూతన ఇంటి కోసం రుణాలు తీసుకోవాలని భావిస్తారు. ఈ రోజు మీ భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోండి. ఉద్యోగులకు నూతన బాధ్యతలు అప్పగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కన్య రాశి
ఈ రోజు మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవచ్చు. ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం. విద్యార్థులు కొన్ని ప్రాజెక్టులకు సమాయాన్ని కేటాయిస్తారు. వ్యాపారులకు నేడు లాభాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన పనులలో ముందడుగు పడుతుంది.
తులా రాశి
నేడు మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి నేడు తగిన సమయం. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలని ప్లాన్ చేసుకుంటారు. కొన్ని విషయాలలో ఒత్తిడి అధికం అవుతుంది.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
వృశ్చిక రాశి
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్నిరోజుల్లో మీరు ప్రమోషన్ పొందే ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తారు. అధిక పని ఒత్తిడికి దారితీస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ధనుస్సు రాశి
మీరు స్నేహితులు, సన్నిహితులతో నేడు సరదాగా కాలక్షేపం చేస్తారు. అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తుంది. చాలా కాలం తరువాత మీ భవిష్యత్తుపై కూడా దృష్టిసారిస్తారు. సృజనాత్మకతకు సంబంధించిన విషయాలలో అవకాశాలు పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులకు లాభాలు చేతికి రానున్నాయి.
మకర రాశి
మకర రాశి వారు ఈ రోజు మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు. అదే సమయంలో మీ పనిని కాస్త నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుంది. నేడు మీ ఖర్చులు అధికం కానున్నాయి. కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.
కుంభ రాశి
గతంలో పోల్చితే నేడు చాలా ఓపికగా వ్యవహరిస్తారు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయడం శ్రేయస్కరం. మీ కుటుంబంతో కలిసి కొన్ని ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఖర్చులు అధికం కావడంతో పనులు నత్తనడకన సాగుతాయి.
మీన రాశి
మీ జీవితంలో దాదాపు అన్ని అంశాలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. కొత్త ఇంటికి మారడం, లేదా కొత్త గదిని తీసుకుంటారు. ఈ రోజు మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. చాలా కాలం తరువాత కొందరు మిత్రులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook