Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 14 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today In Telugu 14 July 2021: కొన్ని రోజుల నుంచి తీరిక లేని పనులతో గడుపుతారు. ప్రతి విషయంలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులు కొత్త చోటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2021, 08:40 AM IST
Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 14 జులై 2021, Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today In Telugu 14 July 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం జులై 14వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. గత కొన్ని రోజులుగా వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకోవడం లేదని తెలుసుకుంటారు. ప్రయాణాల కారణంగా ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగులకు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి
ఈ రోజు చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. మీ చుట్టుపక్కల వారిని  ప్రేరేపించేలా చేస్తుంది. కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులు పెట్టుబడులు చేయడానికి ఇది తగిన సమయం కాదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

మిథున రాశి
కొన్ని రోజుల నుంచి తీరిక లేని పనులతో గడుపుతారు. ప్రతి విషయంలో కాస్త నెమ్మదిగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులు కొత్త చోటుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. చాలా రోజుల తరువాత ఓ స్నేహితుడు మిమ్మల్ని సంప్రదిస్తాడు.

కర్కాటక రాశి
మీరు మీ జీవితంలో జరిగిన విషయాలతో పూర్తిగా సంతృప్తి చెందుతారు. మీ చుట్టూ జరిగే మార్పులను స్వాగతిస్తారు. ప్రయాణాల ద్వారా మీకు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు.

సింహ రాశి
ప్రతికూల ఆలోచనలు ఇబ్బందులకు గురిచేస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. మీరు ఆశించని విషయాలు జరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. 

కన్య రాశి
మీకు ఇష్టమైన వారితో ఉండటానికి ఈరోజు తగిన సమయం కాదు. మీ కుటుంబం అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటారు. గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అనివార్య కారణాలతో ఇబ్బంది ఎదుర్కొంటారు. 

తులా రాశి
ఇతరులతో త్వరగా కలిసిపోయే వ్యక్తిత్వం మీది. ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయండి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. 

వృశ్చిక రాశి 
మీరు గత కొన్ని రోజులుగా ఒత్తిడికి గురవుతున్నారు. అయితే దీనికి నేడు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఏ సమస్య వచ్చినా కంగారుపడరు. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది. వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది.

ధనుస్సు రాశి
గత కొంతకాలం నుంచి తీరిక లేకుండా పని చేయడంతో అలసిపోయినట్లు అనిపిస్తుంది. స్నేహితులతో ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. పనిచేసే చోట ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం దక్కదు.

మకర రాశి
ఈ రోజు అన్ని విషయాలలో మీరు ఆందోళన చెందుతారు. త్వరగా భావోద్వేగాలకు లోనవుతారు. అయితే ఇతరులపై ఆగ్రహాన్ని ప్రదర్శించకూడదు. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగులకు పనిచేసే చోట అవాంతరాలు.

కుంభ రాశి
మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడి, కెరీర్‌లో ఎదగాలని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబసభ్యులకు సహకరారం అందిస్తారు.

మీన రాశి
ఈ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సమయాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ప్రతి కదలికను వ్యూహాత్మకంగా ప్లాన్ చేయండి. నూతన విషయాలపై ఆసక్తి చూపుతారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News