Horoscope Today 12 July 2021: జులై 12వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
ఈ రోజు మేషరాశి వారు ఉత్సాహంగా ఉంటారు. కొన్ని కుటుంబ సమస్యల కారణంగా ఎక్కడికైనా ప్రయాణం చేద్దామని భావిస్తారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రోజు పరిష్కారమవుతాయి. నేడు పనులపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తారు. ఉన్నతాధికారులు దీనిని గమనించి మీకు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు రిలాక్స్ అవుతారు.
వృషభ రాశి
మీరు కోరుకున్న తీరుగా చుట్టుపక్కల వారు మీకు సహకరించకపోవచ్చు. మీ లక్ష్యాలు ఏమిటో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అర్థం చేసుకోకపోవచ్చు, కనుక తల్లిదండ్రులు మరియు ఇతర కుటుంబ సభ్యులతో సహనంతో వ్యవహరించాలి. మీ భవిష్యత్ కోసం ఏదైనా పని చేయడంపై దృష్టి పెట్టండి. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
మిథున రాశి
మీ సృజనాత్మకతను పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ అంతర్గత బలం, మానసిక స్థైర్యం మీకు సహాయం చేస్తుంది. మీరు పనిలో కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇంట్లో, మీ ఇంటీరియర్స్ యొక్క రూపాన్ని మార్చడానికి నిర్ణయం తీసుకుంటారు. స్థిర ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి తగిన సమయంగా భావిస్తారు. బంగారం కొనడం కలిసొస్తుంది.
కర్కాటక రాశి
నేడు మీకు కాస్త అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రోజు విశ్వాసం మీదే. మీరు పనిలో బాధ్యతలకు బంధీ అవుతారు. మీ అంతిమ లక్ష్యాల వైపు దృష్టిసారిస్తారు. వాహనాలు కొనాలని ఆసక్తి చూపుతారు. రోజు చివరిలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం సరదాగా గడుపుతారు.
సింహ రాశి
కుటుంబంతో అధికంగా సమయాన్ని గడపాలని భావిస్తారు. తల్లిదండ్రులు త్వరలోనే నగరం నుండి బయలుదేరబోతున్నందున వారితో ఉంటారు. పిల్లలు మీ నుంచి చిన్న చిన్న ఆనందాలు కోరుకుంటారు. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
కన్య రాశి
మీరు పనిలో తీరిక లేకుండా ఉంటారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు లాభాన్ని అందిస్తాయి. సన్నిహితులతో తమ మనసులో మాటను వ్యక్తం చేస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
తులా రాశి
ఈ రోజు మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త కోర్సు తీసుకోవటానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కెరీర్‌పై దృష్టి పెట్టాలని సలహా ఇస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది.
వృశ్చిక రాశి
వ్యక్తిగత జీవితం విషయంలో కొన్ని భయాలు నెలకొంటాయి. మీరు చాలా నమ్మకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ఈ రోజు ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించడం శ్రేయస్కరం. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశివారు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. మీ చుట్టూ ఉన్న కొందరు పేదలకు సహాయం చేస్తారు. చేపట్టిన పని సజావుగా సాగుతుంది. బంధువులు, సన్నిహితుల నుండి శుభవార్త స్వీకరించే అవకాశం ఉంది. తల్లిదండ్రులు మీ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు తమ చదువు గురించి ఆలోచిస్తారు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
మకర రాశి
ఈరోజు సహనంతో వ్యవహరిస్తారు. అయితే పనిలో తలెత్తే ఇబ్బందులు మీ ఉత్పాదకతకు ఆటంకం కలిగించవచ్చు. ఇంటి నుంచి అందే సమాచారం ఆందోళన కలిగిస్తుంది. మీరు సామాజిక కార్యకలాపాలతో సన్నిహితులకు కాస్త దూరంగా ఉంటారు.
కుంభ రాశి
గతంలో చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి చేతికి దక్కనుంది. ఈ రోజు మీరు చురుకుగా పనులు చేయాలంటే, అనవసర విషయాలకు దూరంగా ఉండాలి.
మీన రాశి
కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంట్లో సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. పనిచేసే చోట వాదనలు చేయడం మానుకుని, మీ పనిని పూర్తి చేయాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలనుకుంటే, కొంతకాలం వేచిచూడటం శ్రేయస్కరం. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook