Horoscope Today 09 July 2021: మేష రాశి
ఈ రోజు మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలని భావిస్తారు. మీరు చేసిన తప్పులను పరిశీలించడానికి సమయాన్ని వెచ్చించండి. మీరు ఉద్యోగాలు మారడం లేదా కొత్త వెంచర్ ప్రారంభించడం గురించి ఆలోచిస్తుంటే, ఈ రోజు అందుకు తగిన సమయం. ఆలోచించుకున్న తరువాతే నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభ రాశి
మీరు ఆరోజు ఆనందంగా గడుపుతారు. గత కొన్ని రోజులుగా తీరిక లేని పనులతో ఉన్న మీరు నేడు పని నుంచి కాస్త విరామం తీసుకుంటారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలి. నేడు మీ ఖర్చులు అధికం కానున్నాయి. విద్యార్థులు ఉన్నత చదువు, కెరీర్ గురించి ఆలోచిస్తారు.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
గతాన్ని మరచిపోయి ముందుకు సాగడానికి మరియు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. కొందరు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. చాలా రోజుల తరువాత స్నేహితులు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం పొందుతారు. చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి
సన్నిహితులతో మాట్లాడటానికి పని నుంచి కాస్త విరామం తీసుకుంటారు. ఈ రోజు మీరు వ్యక్తిగత మార్గదర్శిగా కొందరికి సలహాలు ఇస్తారు. స్నేహితుడికి సహాయం చేయడానికి సమయం కేటాయిస్తారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. ప్రయాణాల కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
సింహ రాశి
నేడు మీకు ఎదురయ్యే కొన్ని పరిస్థితులకు అవును అని సమాధానమిస్తారు. మీ కెరీర్లో కొత్త మార్గం లభించినా, భవిష్యత్తును మార్చుకునే అవకాశం దొరికినా నో చెప్పకూడదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
కన్య రాశి
ప్రతి సమయంలో ఒకే చోట ఉండడం వల్ల మీ ఉత్పాదకత మరియు సృజనాత్మకత ఒకే ప్రాంతానికి పరిమితం అవుతుంది. మీరు నేడు ప్రయాణాలు చేయాలని ప్లాన్ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు. గతంలో చేయని పనులను ప్రయత్నించడానికి మీకు ప్రేరణ లభిస్తుంది.
తులా రాశి
తులా రాశివారు నేడు భావోద్వేగానికి లోనవుతారు. మొత్తం పని మీరు పూర్తి చేయాలని భావించడం ద్వారా సమస్య తలెత్తుతుంది. ఇందుకు బదులుగా ఒక రోజు సెలవు తీసుకొని మీ కార్యాచరణను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడానికి సమయాన్ని వెచ్చించండి. విద్యార్థులు ఉన్నత చదువు గురించి ఆలోచిస్తారు.
వృశ్చిక రాశి
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఈ రోజు ఇతరులను గుడ్డిగా నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి. జరిగే విషయాలను మీ చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలం అవుతాయి. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. అధికంగా శ్రమించినా ఫలితం దక్కదు.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
ధనుస్సు రాశి
మీరు ప్రయాణించడం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడతారు. ఈ రోజు అలా చేయడానికి సరైన రోజు. మీరు గత కొంతకాలంగా కోరుకుంటున్న విరామం తీసుకుంటారు. వీలైతే భూములు లేదా ఇల్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాసాటిగా ఉంటుంది.
మకర రాశి
మీకు బాగా తెలిసిన వాటికి దగ్గరగా ఉన్నంతకాలం మీరు ఎలాంటి కొత్త విషయాలను నేర్చుకోరు. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటే అవకాశాలు మెరుగవుతాయి. నేడు మీరు ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. కెరీర్ గురించి పునరాలోచిస్తారు.
కుంభ రాశి
గతం గురించి తెలుసుకోవడం ద్వారా ప్రయోజనం లేదని గ్రహిస్తారు. భవిష్యత్తు అయితే మీ చేతుల్లో ఉంది. మీ ఆరోగ్యం మరియు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోండి. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. ప్రణాళికా ప్రకారం మీ లక్ష్యాలను సాధిస్తారు. ఆకస్మిక ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయి.
మీన రాశి
మీ జీవిత భాగస్వామి పట్ల మీకున్న ప్రేమను అర్థం చేసుకోలేదని బాధపడతారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆకస్మిక ధనవ్యవయం. వ్యాపారులకు పరిస్థితి అంతగా అనుకూలించదు. పెట్టుబడులకు కొంతకాలం దూరంగా ఉండటం శ్రేయస్కరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook