Horoscope Today In Telugu 04 July 2021: మేష రాశి
అర్థంపర్థం లేని విషయాల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. దీని వల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఈ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. నేడు మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఖర్చులపై సమీక్ష చేసుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుంది.
వృషభ రాశి
నేడు కుటుంబసభ్యులతో బయటకు వెళ్లి సరదాగా సమయం గడుపుతారు. పని నుంచి కాస్త విరామం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. గత కొంతకాలం నుంచి మీతో మాట్లాడని వ్యక్తులు మీ తలుపు తడతారు. మీరు మరింత ఉత్సాహంగా పనులు పూర్తి చేయడానికి సిద్దమవుతారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
Also Read: Sai Baba madhyana aarati lyrics: షిర్డీ సాయి బాబా మధ్యాహ్న హారతి తెలుగు లిరిక్స్
మిథున రాశి
డబ్బు ఆదా చేయడం ఈరోజు మీ ఏకైక లక్ష్యంగా చేసుకుంటారు. గతంలో చేసిన ఖర్చులు, ఆర్థిక పరిస్థితిపై సమీక్షించుకుంటారు. మరోవైపు నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. మీరు ఊహించని వ్యక్తి నుంచి ప్రేమాభిమానాలు పొందుతారు. ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, కానీ మీకు ఆ వ్యక్తి అంతగా తెలియదని గుర్తుంచుకోండి. శుభకార్యాలలో ముందడుగు పడుతుంది.
కర్కాటక రాశి
ఓ వ్యక్తి ఆత్మవిశ్వాసంతో తన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తుంటే, వారికి కలిగే అవరోధాలను మీరు దూరం చేయడానికి చేయూత అందిస్తారు. నేడు కొత్త ప్రాజెక్టులు, పనులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. గతంలో ప్రారంభించిన విషయాలపై దృష్టిసారించండి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గనుంది.
సింహ రాశి
మీకు అత్యంత ఇష్టమైన వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయండి. పనిలో కొత్త ఆలోచనతో మీకు కావలసిన ఏదైనా చేయండి. మరోవైపు, మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వస్తాయి. గొడవకు దారితీయకముందే వారితో చర్చించి విషయాలు పరిష్కరించుకోవాలి. ప్రయాణాల కారణంగా తలెత్తిన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.
Also Read: Mrigasira Karthi: మృగశిర కార్తె అంటే ఏమిటి, ఈ సమయంలో చేపలు తినడానికి కారణాలు ఇవే
కన్య రాశి
ఈ రోజు మీ జీవితంలో పలు అంశాలలో మార్పు జరగే అవకాశం ఉంది. ఈ రోజు మీ పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శ్రమకు తగిన ఫలితం రాకపోవడంతో కాస్త నిరాశకు లోనవుతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు మొదలుపెడతారు. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
తులా రాశి
మీ కళ్ల ముందు జరుగుతున్న విషయాల కంటే మీ చుట్టూ ఏం జరుగుతుంతో తెలుసుకోవడం చాలా ముఖ్యమని గ్రహిస్తారు. ఒకరికి సహాయపడటానికి ముందుకొస్తారు. ఇతర వ్యక్తుల విజయంతో మునిగిపోకుండా మీకోసం ఏం చేసుకుంటున్నారో పరిశీలించుకోవాలి. పిల్లల ఆరోగ్యం మీకు సమస్యగా మారుతుంది. కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.
వృశ్చిక రాశి
మీరు కెరీర్ గురించి చేసుకుంటున్న ప్లాన్లలో ప్రస్తుతానికి విరామం ఇవ్వండి. ఈ రోజు మీ వ్యక్తిగత పనులపై ఎక్కువ దృష్టిసారించాల్సి ఉంటుంది. కుటుంబంతో సరదాగా సమయాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
Also Read: Jyeshtha Purnima 2021 puja, remedies: జ్యేష్య పూర్ణిమ నాడు ఈ పూజ చేస్తే వ్యాపారంలో లాభాలు
ధనుస్సు రాశి
మీరు ఎదుర్కొంటున్న ఏదైనా వృత్తి సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మీ కుటుంబసభ్యులు నేడు మీ అభిప్రాయాలను వినకపోవచ్చు. అయితే ఓపికగా వ్యవహరించాలి. పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పనులలో జాప్యం జరగడంతో సమయానికి చేతికి డబ్బు అందదు. రుణాల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
మకర రాశి
మకర రాశివారు నేడు తమ చుట్టూ ఉన్నవారికి తోచిన విధంగా సహాయం చేస్తారు. సృజనాత్మకతకు సంబంధించిన పనులపై శ్రద్ధ చూపుతారు. ఇంట్లో సామాన్లు మార్చాలని భావిస్తారు. ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు.
కుంభ రాశి
సాధారణం కన్నా నేడు మీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడంలో మీ కుటుంబం సహాయం చేస్తుంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెడతారు. చేతికి డబ్బు అందుతుంది. వాహనాలు కొనుగోలు చేయాలని భావిస్తారు.
మీన రాశి
మీనరాశి వారు నేడు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షితులవుతారు. కొన్ని ప్రాజెక్టులు, వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. ప్రయాణాలు చేయడంతో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వ్యాపారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చుట్టుపక్కల వారు మీ పరిస్థితిని అర్థం చేసుకుని నడుచుకుంటారు. వాదనకు దిగకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook