Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 28, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Today Horoscope In Telugu 28 May 2021: మీరు చేపట్టిన పనులను అనివార్య కారణాలతో తాత్కాలికంగా నిలిపివేస్తారు. కొందరు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2021, 08:15 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 28, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Horoscope Today 28 May 2021: మేష రాశి
మీ కెరీర్, మరియు మీ కుటుంబం రెండు విషయాలపై నేడు దృష్టిసారించాలి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో దైవదర్శనాలు చేసుకోవాలని భావిస్తారు. ఈ రోజు మీరు ప్రేమను కోల్పోయే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో కుంటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. 

వృషభ రాశి
ఈ రోజు మీరు చాలా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాలలో మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. కానీ ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు మీకు మేలు చేయవు. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడంపై ఆలోచిస్తారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన ఉద్యోగావకాశాలు మీ తలుపు తట్టనున్నాయి.

Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది

మిథున రాశి
మీ జీవితంలో ప్రేమ అనేది మీకు ఎప్పుడూ దూరం అవుతుందని భావిస్తారు. కానీ మీరు ప్రేమించిన వ్యక్తులు మీకు దగ్గర్లోనే ఉన్నారు. ఆర్థిక పరిస్థితి సమీక్షించుకుంటారు. ఉద్యోగులకు పనిలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు పెట్టేందుకు తగిన సమయం.

కర్కాటక రాశి 
ఈ రోజు కొత్త దంపతులు ఏకాంతంగా గడపటానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో సమస్య ఉంటే నేడు చర్చించి పరిష్కారం కోసం ఆలోచిస్తారు. నేడు కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరాదాగా గడుపుతారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు.

సింహ రాశి
మీ ప్రేమ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా గత కొంతకాలం నుంచి అబద్ధాలు చెబుతున్నారు. అయితే నేడు ఆ విషయాన్ని చెప్పి ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. పనులు మధ్యలోనే నిలిచిపోతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేయాలి. . 

కన్య రాశి
అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఖర్చులు అధికం కావడంతో ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. జీవిత భాస్వామితో సమస్య ఉంటే చర్చించి పరిష్కారం చేసుకోడానికి తగిన సమయం. మీ ఇద్దరి మధ్య అపార్థాలను దుర్వినియోగం చేసుకునేందుకు కొందరు యత్నిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

తులా రాశి
కొంతకాలంగా మిమ్మల్ని విస్మరిస్తున్న ఒక వ్యక్తి మీ నమ్మకాన్ని కోల్పోతాడు. వారి కర్మల ఫలితాన్ని వారే అనుభవిస్తారు. నిజాయితీగా, నమ్మకంగా ఉండకపోతే ఏ విషయంలోనూ విజయాలు సాధించలేరు. కొన్ని పుస్తకాలు చదువుతారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించాలి.

వృశ్చిక రాశి
మీరు చేపట్టిన పనులను అనివార్య కారణాలతో తాత్కాలికంగా నిలిపివేస్తారు. కొందరు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. ఖర్చులు అధికం కావడంతో కొత్తగా రుణ యత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు రాశి
గత కొంతకాలం నుంచి మిమ్మల్ని వెనక్కిలాగిన శక్తి అదృశ్యమవుతుంది. కొత్త సవాళ్లను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగులకు పనిలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు లాభసూచన. అరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆలోచిస్తారు.

మకర రాశి
సాధారణంగా పనిలో మాత్రమే ఆనందాన్ని వెతుక్కోవడం మంచి విషయం కాదు. కుటుంబసభ్యులతోనూ సరదాగా గడిపితే మానసిక ప్రశాంతత మీ సొంతం. కానీ మీ సహోద్యోగి మీపై కొంత ఆసక్తి చూపుతారు. దాంతో మీపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు అధికం కావడంతో ఇబ్బందులు. కొన్ని పనులు వాయిదా పడతాయి.

Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు

కుంభ రాశి
ఈ రోజు మీరు ప్రేమ కోసం పరితపిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసేందుకు నిర్ణయం తీసుకుంటారు. చాలా కాలం తరువాత స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులు మరింత పెట్టుబడి కోసం ఎదురుచూపులు.

మీన రాశి
కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తగిన సమయం ఇది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి చేతికి దక్కుతుంది. ఓ వ్యక్తి మీకు క్షమాపణ చెబుతాడు. భవిష్యత్తులోనూ వారికి ఉండాలని నిర్ణయం తీసుకుంటారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News