Horoscope Today 26 May 2021: శ్రీ ప్లవ నామ సంవత్సరం మే 26వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.
మేష రాశి
మీరు మీ వృత్తి పట్ల మరింత సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. దాని వల్ల మీ పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలతో ఖర్చులు అధికం కానున్నాయి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
వృషభ రాశి
మీరు పనిచేసేచోట ఇతరులతో కమ్యూనికేషన్ మీరు అనుకున్నదానికంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తుంది. పనిలో మీతో పాటు ఉన్న సహోద్యోగులతో చర్చించి సమస్య పరిష్కరిస్తారు. ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. కొన్ని విషయాలలో స్నేహితులు, బంధువుల నుంచి సహకారం అందుకుంటారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
మిథున రాశి
ఈ రోజు పనిలో మీ సృజనాత్మకతను నిరూపించుకుంటారు. మీ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి దోహదం చేస్తాయి. వ్యాపారులకు పెట్టుబడికి తగ్గ లాభాలు అందుతాయి. పనులను పక్కనపెట్టి కుటుంబంతో సమయం గడపాలని భావిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఇతరుల సలహా తీసుకుంటారు.
కర్కాటక రాశి
చాలా కాలం నుంచి పనులతో తీరిక లేకుండా గడుపుతున్న మీరు నేడు కొంత విశ్రాంతి కోరుకుంటారు. దాని వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఖర్చులు అధికం కావడంతో చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సింహ రాశి
అధిక పని, ఒత్తిడి కారణంగా మీరు గందరగోళానికి గురవుతారు. కొంత సమయం పనిని పక్కనపెట్టి ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతంగా ఆలోచిస్తారు. నేడు సింహ రాశి వారికి ఆకస్మిక ధనవ్యవయం గోచరిస్తుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య రాశి
కన్యారాశి వారికి ఈరోజు సత్ఫలితాలు అందుతాయి. కొందరు వ్యక్తుల నుంచి శుభవార్తలు వింటారు. పని చేసే చోట మీకు తగిన గుర్తింపు, ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి నుండి మీరు అన్ని నిర్ణయాలు తీసుకునే సమావేశాల్లో పాల్గొంటారు. బాల్య స్నేహితులు మిమ్మల్ని కలుసుకుంటారు. వ్యాపారులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
తులా రాశి
ఈరోజు మీరు మీ ఆర్థిక పరిస్థితి సమీక్షించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు అధికం కావడంతో కుటుంబసభ్యుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అనారోగ్యం బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోషకాహారం తీసుకోవాలి, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందవు.
వృశ్చిక రాశి
ఈరోజు మీరు ఓ శుభవార్త అందుకుంటారు. దాంతో రోజంతా మీరు సంతోషంగా గడుపుతారు. మీరు చేపట్టిన ఒక ప్రాజెక్టుపై ఎట్టకేలకు ఒప్పందం కుదుర్చుకుని విజయం సాధిస్తారు. గతంలో చేసిన పెట్టుబడులకు నేడు లాభాలు అందుకుంటారు. డబ్బు చేతికి రావడంతో కొన్ని కొనుగోలు చేయాలని ఆశ పడతారు. పని మొదలుపెట్టడానికి ముందు కొందరి సలహాలు స్వీకరిస్తారు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీరు మీ పనిపై మాత్రమే దృష్టిసారించాలి. మీరు మీ ఉద్యోగాన్ని కొనసాగించాలనుకుంటే, మీరు ఏం చేయగలరో మీ యజమానులకు చేసి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని విషయాలలో సన్నిహితులతో విభేదాలు వస్తాయి. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు.
Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos
మకర రాశి
మీరు కేవలం పని చేయడంతోనే సమయాన్ని గడిపేస్తున్నారు. కానీ మీకోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తుంటారని గమనించి, కాస్త విరామం తీసుకుంటారు. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పని చేస్తూనే ఉంటారు. కొన్ని శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులకు సిద్దమవుతారు.
కుంభ రాశి
మీరు ప్రారంభించిన కెరీర్ కొనసాగించాలా, లేదా కొత్త రంగంలోకి మారాలా అనే దానిపై పునరాలోచిస్తారు. మీ మనస్సును మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ధ్యానం చేయండి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఆస్తి, నగదు చేతికి వస్తుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు వస్తాయి.
మీన రాశి
మీరు కొత్త విషయాలు నేర్చుకుని మీ జ్ఞానాన్ని విస్తరించుకోవాలి. పనిచేసే వ్యక్తులైతే కచ్చితంగా ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడంతో ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని పనులు మధ్యలోనేని నిలిచిపోతాయి. పరిస్థితులు అనుకూలించక పోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook