Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 26, 2021 Rasi Phalalu, వారికి ఉద్యోగం

Horoscope Today 26 February 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 26న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2021, 07:47 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 26, 2021 Rasi Phalalu, వారికి ఉద్యోగం

Horoscope Today 26 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 26న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీరు గతంలో చేసిన తప్పులను నెమరువేసుకుంటే మీ సమస్యలన్నింటికి పరిష్కారం దొరుకుతుంది. ఎక్కడ తప్పు జరిగిందో అర్థం చేసుకుంటే దాని త్వరగా పరిష్కారం దిశగా అడుగులు పడతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ముఖ్యంగా నేడు మీరు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. 

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

వృషభ రాశి
మీకు అప్పగించిన బాధ్యతల కారణంగా మీకు ఇష్టమైనవారు, కుటుంబసభ్యుల నుంచి కొంత దూరంగా గడపాల్సి వస్తుంది. అయితే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారులకు లాభాలు వస్తాయి. మీ ఉద్యోగాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి యోచించాల్సి ఉంటుంది. శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిథున రాశి
సహచరులు ఈరోజు మీ ఆలోచనలకు మద్దతు తెలిపేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తారు. దీంతో మీకు చిరాకు కలుగుతుంది. అయితే మీపై మీరు నమ్మకం ఉంచి ముందడుగు వేస్తే కార్యజయం సిద్ధిస్తుంది. విషయాన్ని, సమస్యను చక్కగా వివరించి సహకారం పొందుతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. 

కర్కాటక రాశి
ఈ రోజు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీరు చాలా సంతోషంగా, సరదాగా గడుపుతారు. అదే సమయంలో ఏదైనా సాధించాలంటే రిస్క్ తీసుకోవటానికి ఇది చాలా మంచి రోజు. ఆర్థికంగా ఏ సమస్య ఉండదు. ఉద్యోగులు, వ్యాపారులకు కలిసొస్తుంది. చాలా కాలం తరువాత స్నేహితులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో మరో అడుగు ముందుకు పడుతుంది.

సింహ రాశి
మీరు ఈ రోజు తీరిక లేకుండా గడపున్నారు. మార్పు కోసం ఈ బిజీ షెడ్యూల్‌ను సైతం ఆస్వాదించబోతున్నారు. అదే సమయంలో అనారోగ్య సమస్య, ప్రయాణాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయనున్నాయి. ఉద్యోగులకు ఒత్తిడి అధికం అవుతుంది. కొన్ని పనులలో అనవసరంగా మాట పడాల్సి వస్తుంది.

కన్య రాశి
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు సైతం అందుకుంటారు. అయితే మీరు ఇతరుల గురించి ఎక్కవగా ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ రోజు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవద్దు. పనిచేసే చోట కొంత గందరగోళం, వివాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మాత్రం మెరుగ్గా ఉంటుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. సన్నిహితులతో, బంధువులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి 

తులా రాశి
కొన్ని రోజులుగా వాయిదా వేసిన మార్పులు చేయడానికి ఇది సరైన రోజు. మీరు తీసుకోవలసిన పెద్ద నిర్ణయాలు తీసుకునేందుకు సైతం నేడు తగిన సమయంగా భావించవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతా మంచి జరుగుతుంది. ఉద్యోగావకాశాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మీరు చేసే పనిని ఇతరులు గమనిస్తూనే ఉంటారు. దైవదర్శనం చేయాలని భావిస్తారు. కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. 

వృశ్చిక రాశి
చేపట్టిన కార్యక్రమాలలో జాప్యం జరుగుతుంది. ఈ పరిస్థితి మీకు చికాకు తెప్పిస్తుంది. అయితే మానసిక ప్రశాంతతను కోల్పోకుండా సంయమనం పాటించాలి. కొత్తగా కెరీర్ ప్రారంభించే దిశగా అడుగులు వేయనున్నారు. ఈరోజు మీరు తీరిక లేకుండా గడుపుతారు. కుటుంబసభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కూడా సహకరించదు. ఆర్థిక సమస్యలు సైతం మిమ్మల్ని వెంటాడుతాయి.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం

ధనుస్సు రాశి
మీరు భయాలను వీడండి, ఎదుర్కొంటున్న సవాళ్లను నిర్భయంగా స్వీకరించండి. మీ మునుపటి లక్ష్యాలపై దృష్టి పెట్టండి. నిరంతర శ్రమతో సత్ఫలితాలు రాబట్టవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. పనులు పూర్తి చేసేందుకు రుణాలు తీసుకునేందుకు సిద్ధమవుతారు. 

మకర రాశి
వృత్తిపరమైన రంగంలో మీరు తీవ్ర నిరాశకు గురవుతారు. మీరు కష్టించి పనిచేసినా ఫలితం వేరేలా రావచ్చు. అయినప్పటికీ మీ ఆలోచనలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉంటాయి. ఇతరుల సలహాలు సైతం స్వీకరించి ముందుకు సాగాలి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇందుకోసం యోగా, ధ్యానం మార్గాలుగా ఎంచుకుంటారు. మీ మంచితనం, పనితీరుతో సమాజంలో గౌరవం, పేరుప్రతిష్టలు దక్కుతాయి.

కుంభ రాశి
సృజనాత్మక సంబంధిత రంగంలో మీకు తలుపుతు తెరిచే ఉన్నాయి. మీ ఆలోచనల్ని కెరీర్ వైపు మళ్లించి ముందుకు సాగుతారు. దాని గురించి మీరు ఏమి చేయగలరో గమనించండి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నేడు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు. వ్యాపారులకు లాభాలు అందుతాయి.

మీన రాశి
మీ పని మరియు ఆలోచనలు ఈ రోజు ప్రధానంగా ప్రశంసించబడతాయి. మీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఆలోచించాలి. ఇతరులకు మీ సమస్య వివరించి వారి నుంచి సహకారాన్ని పొందుతారు. మీరు చేసే పనులను వెనక్కి తీసుకోవద్దు. అనుకోని సంఘటనల కారణంగా కుటుంబంలో స్వల్ప విభేదాలు, చికాకులు గోచరిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News