Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 23, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Today Horoscope In Telugu 23 March 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 23న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2021, 07:54 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 23, 2021 Rasi Phalalu, ఆ రాశులవారికి ధనలాభం

Horoscope Today 23 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 23న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ముఖ్యమైన విషయాలను పక్కన పెట్టి, మీ ప్రేమ జీవితం కోసం తాపత్రయపడతారు. బయటకు వెళ్లి క్రొత్త వ్యక్తులను కలవండి. వారి నుంచి మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. నేడు ఈరాశి వారికి ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. గొడవలకు వెళ్లకపోవడంతో మీ చుట్టూ సంతోషకర వాతావరణం ఉంటుంది.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

వృషభ రాశి
ఈ రోజు మీ నాయకత్వ నైపుణ్యాలపై మీకు అవగాహన వస్తుంది. చుట్టుపక్కల ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాలని కోరుకుంటారు. మీ ఉత్తమ అడుగు వేసి మీ బృందానికి నాయకత్వం వహించండి. ఖర్చులు పెరిగి రుణాల కోసం యత్నిస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని నియంత్రించుకోకపోతే సమస్యలు తప్పవు.

మిథున రాశి
మీరు మీ డబ్బు ఆదా చేయడం ప్రారంభించకపోతే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. అవసరమైన చోట ఖర్చు చేయాలి, లేనిచోట పొదుపు చేయడం నేర్చుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడుతుంది. కొన్ని విషయాల కారణంగా గొడవ జరగే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

కర్కాటక రాశి 
ఈ రోజు మీలో ఏదో ప్రతికూల ఆలోచన వస్తే ఆశ్చర్యపోకండి. ప్రతి ఒక్కరిలో ఇలాంటి రోజులు వస్తాయి. అయితే ఇది శాశ్వతంగా ఉంటుందని అర్థం చేసుకుంటారు. కెరీర్‌లో మంచి విషయాలపై దృష్టి పెట్టండి. అనారోగ్యం బాధిస్తుంది. వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి.

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

సింహ రాశి
పనికి తగ్గట్లు మీ బాధ్యతలు అన్ని సమయాలలో మారుతాయి. మీరు తీసుకోని బాధ్యతలు ఇతరుల చేతికి వస్తాయి. కష్టాలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఆశించిన విధంగా చేతికి డబ్బు అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తారు.

కన్య రాశి
కొందరు మిమ్మల్ని పట్టించుకోలేదని చిరాకు పడతారు. దాని వల్ల కొందరు మీకు దూరంగా జరుగుతారు. ప్రతి ఒక్కరు మిమ్మల్ని పొగడాలని చూస్తే నిరాశ తప్పదు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం. భరించలేని ఖర్చుల కారణంగా కొత్త రుణాలు చేస్తారు. ఉద్యోగులకు పని ఒత్తిడి బారం కానుంది. 

తులా రాశి
నేడు మీకు ఆకస్మిక ధన్యవయం గోచరిస్తుంది. ఇతరుల అవసరాలకు సర్దుబాటు చేయాలని భావిస్తారు. మీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ పోవడంతో మీకు కొంత అసౌకర్యంగా అనిపించవచ్చు. మిమ్మల్ని ఈరోజు అదృష్టం వరించనుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంట్లో కొన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వృశ్చిక రాశి
ఈరోజు మీరు ముందడుగు వేసి ఓ పెద్ద పనిని ప్రారంభిస్తారు. మీరు చేసిన పనికి ఇతరుల క్రెడిట్ తీసుకోవచ్చు. మరియు ప్రతి పని చేస్తున్నది మీరేనని వారికి గుర్తు చేయండి. మీ సామర్థ్యం ఏమిటో ఇతరులకు తెలిసేలా చేసి గుర్తింపు పొందుతారు. కుటుంబసభ్యులతో గొడవలు తలెత్తే సూచనలు గోచరిస్తున్నాయి.

ధనుస్సు రాశి
మీరు ఈరోజు చాలా విషయాలలో రాజీ పడుతున్నారు. ఇతరులు మీ గురించి ఏమి చెబుతున్నారో అంగీకరించడానికి ఇది మంచి రోజు. పనిచేసే చోట ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. బంధువులు, సన్నిహితుల సాయాన్ని ఆశిస్తారు. వ్యాపారులకు నష్టాలు గోచరిస్తున్నాయి.

Also Read: Non-Veg పిజ్జా డెలివరీ, 1 కోటి రూపాయాలు పరిహారం కోరిన మహిళ, అమెరికా ఔట్‌లెట్‌కు నోటీసులు

మకర రాశి
మీరు అందరి దృష్టి మీపై ఉండాలని కోరుకుంటారు. కానీ అన్నివేళలా ఇది సాధ్యం కాదని గ్రహించాలి. మీరు ఎల్లప్పుడూ ఇతరుల విషయాలను రహస్యంగా ఉంచుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగడంతో రుణాల కోసం చేతులు చాపుతారు.

కుంభ రాశి
మీరు చెప్పేది ఓ వ్యక్తి పట్టించుకోనందున మీరు ఆవేశానికి లోనవుతారు. ఆ వ్యక్తి తమ మాత్రమే ఆలోచిస్తాడని తెలుసుకుంటారు. మీరు మంచి వ్యక్తి అని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదు. అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. శారీరక శ్రమ అధికం కానుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

మీన రాశి
మీరు ఈ రోజు సోమరితనంగా ఉన్నారని భావిస్తారు. అదే సమయంలో మీకు పని కావాలనే విషయాన్ని గుర్తుచేసుకుంటారు.  మీరు ఇంట్లో కూర్చుని విశ్రాంతి తీసుకోలేరు. మీ సహోద్యోగులకు అవసరమైన విషయాలలో సహాయం చెయ్యండి. కీలక పనులు పూర్తి చేస్తారు. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Trending News