Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Today Horoscope In Telugu 22 March 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 22న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2021, 07:50 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 22, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 22 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 22న సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ పని ఒత్తిడి కారణంగా ప్రవర్తన మీ భాగస్వామిలో చిరాకును పెంచుతుంది. అయితే ఆచితూచి వ్యవహరించాలి. ఆఫీసులో పనిని త్వరగా వదిలివేయడానికి ప్రయత్నించండి మరియు ఇంట్లో మీ జీవిత భాగస్వామికి సమాయాన్ని కేటాయించండి. కొన్ని శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగులు నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. చేపట్టిన పనులకు ఆటంకాలు తొలగిపోతాయి.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

వృషభ రాశి
మీరు మీ సమస్యలను మీ జీవిత భాగస్వామి లేదా చాలా సన్నిహితంగా ఉన్నవారితో చర్చించాలనుకుంటున్నారు. మీ గురించి మరియు మీ జీవితంలో జరిగిన విషయాలు చెప్పడాన్ని వారు సంతోషంగా స్వీకరిస్తారు. ప్రయాణాల కారణంగా ధనవ్యయం గోచరిస్తుంది. కుటుంబసభ్యులు, మిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. 

మిథున రాశి
మీకు మరియు మీ సన్నిహితులకు మధ్య ఏదైనా అపార్థాలుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. మీ ధోరణి వల్ల అవతలి వ్యక్తులు ఇబ్బంది పడ్డారని మరచిపోరాదు. మనసు ప్రశాంతంగా ఉండేందుకు యోగా, ధ్యానం లాంటివి చేయడం శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. వ్యాపారులకు కొంతమేర కలిసొస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే ఆశించిన ఫలితం రానుంది.

కర్కాటక రాశి 
అనుకోని విధంగా మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి దూరం కానున్నారు. ఈ విషయాలలో ఎక్కువగా ఆలోచించవద్దు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, వాటిని తెలుసుకున్నాక నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటారు. అధికంగా శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. అనారోగ్యం కారణంగా పనులు వాయిదా వేసుకుంటారు.

సింహ రాశి
మీ ప్రతికూల ఆలోచనలు ఇంట్లో ఇబ్బందులను రెట్టింపు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. పాజిటివ్‌గా ఆలోచించాలి, ఇతరుల సమస్యలు పరిష్కరించుకునే దిశగా అడుగు వేస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం చేయాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రానున్నాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

Also Read: Non-Veg పిజ్జా డెలివరీ, 1 కోటి రూపాయాలు పరిహారం కోరిన మహిళ, అమెరికా ఔట్‌లెట్‌కు నోటీసులు

కన్య రాశి
మీ వ్యక్తిగత జీవితానికి ఈ రోజు అధికంగా ప్రాధాన్యం ఇస్తారు. మీకు ఇష్టమైనవారితో ఎక్కువ సమయం గడుపుతారు. మీ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి అని వారికి గుర్తు చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పనులలో పురోగతి లభిస్తుంది. ఈరోజు కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడతాయి. 

తులా రాశి
మీ జీవిత భాగస్వామిని కొంచెం నిర్లక్ష్యం చేసినట్లు అనిపిస్తుంది. అయితే అందుకు కారణాలు చెబుతూ, పరిస్థితిని వివరించే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఒంటరిగా ప్రయాణించవద్దు. మీ మార్గంలో మరొకరిని తోడుగా తీసుకెళతారు. పని నుంచి కాస్త విరామం కోరుకుంటారు. ప్రయాణాలు చేయాల్సి రావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. కెరీర్ పరంగా అనూహ్య ఘటనలు ఎదురుకానున్నాయి.

వృశ్చిక రాశి
మీరు ఉద్వేగానికి లోనవుతారు. అయితే భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి తగిన తరుణం ఇది అని గుర్తిస్తారు. కొన్ని బాధ్యతలను స్వీకరించడంతో మీపై గౌరవం పెరుగుతంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వారు తెలుసుకుంటారు. శ్రమకు తగ్గ ఫలితం రాదని చింతిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఒత్తిడి అధికమవుతుంది.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ జీవితంలో సంతోషాన్నిచ్చే సంఘటన ఒక్కటి కూడా జరగదు. మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలకు వెళ్లరాదు. మీరు మీ భాగస్వామితో, లేదా స్నేహితులతో సమయం గడపాలని భావిస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి
మీరు కొంతకాలం నుంచి నిలువరించడానికి ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తి మిమ్మల్ని సంప్రదించవచ్చు. కొన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మీ ఆధిపత్య వైఖరి అవతలి వ్యక్తిని బాధపెడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శించాలని భావిస్తారు. వ్యాపారాలు మొదలుపెట్టేందుకు తగిన సమయం కాదు. కుటుంబసభ్యులు, లేదా సన్నిహితులతో కొన్ని విషయాలలో తగాదాలు రావచ్చు.

Also Read: Vastu Tips: రాత్రివేళ హాయిగా నిద్రించాలంటే Pillow కింద ఉంచాల్సిన వస్తువులు ఇవే

కుంభ రాశి
అనుకోని విధంగా ఈరోజు ఎవరైనా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే వారి ఉద్దేశాలను మీరు ప్రశ్నించవద్దు. సాంకేతిక పరమైన దిశగా అడుగులు పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు మీ ఖర్చులను అధికం చేస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పరిస్థితులను తేలికగా తీసుకుంటారు.

మీన రాశి
జీవిత భాగస్వామి ఈ రోజు మీ జీవితంలో అత్యంత సహాయకారిగా ఉంటారు. మీ కఠినమైన సమయాల్లో కూడా వారు మీ పక్కన ఉన్నారని సంతోషంగా ఉండండి. చేపట్టిన పనులలో అవాంతరాలు ఎదురవుతాయి. ఆకస్మిక ధనవ్యయంతో ఇబ్బందులు, విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారులకు కాస్త నిరాశజనకంగా ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Trending News