Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 12, 2021 Rasi Phalalu

Today Rasi Phalalu in Telugu: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 12 రాశి ఫలాలు ఇక్కడ అందిస్తున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2021, 08:39 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 12, 2021 Rasi Phalalu

Horoscope Today In Telugu 12 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 12న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు సృజనాత్మకతపై మీరు దృష్టిసారిస్తారు. ఇందులో భాగంగా మీ బృందాన్ని ఇతరుల ప్రాంతాలకు పంపిస్తారు. ఇది ఉద్యోగం, లేక వ్యాపారం విషయంలోనూ కావచ్చు. ఇంట్లోనూ కుటుంబసభ్యులతో భిన్నంగా ప్రవర్తిస్తారు. మీ కుటుంబ పెద్దకు కొన్ని విలువైన సలహాలు, సూచనలు చేస్తారు. ఈరోజు మీకు లాభదాయకం.

Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ

వృషభ రాశి
ఈ రోజు వృషభ రాశి వారికి సభ్యత లేని వ్యక్తులు తారసపడతారు. వారితో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదు. కచ్చితంగా విషయాలను స్పష్టంగా చెప్పేయడం ఉత్తమం. ఈ రోజు అనుకున్న పనిని మొదలుపెట్టే సూచన కనిపిస్తోంది. ఉద్యోగులు ప్రమోషన్ విషయంలో ముందుకు సాగుతారు. మీరు చేస్తున్న పని గురించి వారికి వివరిస్తారు. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు.

మిథున రాశి
మీరు అనుకున్న పనులు సజావుగా జరగవు. అయితేనేం మీకు ఈరోజు అంతా శ్రేయస్కరమే. మీలోని భావాలను వ్యక్తం చేస్తారు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. సొంత ఇంట్లో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు మీ చుట్టూ ఉండటంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

కర్కాటక రాశి
నిస్వార్థంగా ఉండటం చాలా మంచి విషయం, కానీ ఈ రోజు మీరు కొంచెం స్వార్థపూరితంగా ఉండాల్సి వస్తుంది. మీకు కావాల్సినవి దక్కించుకోవడంపై దృష్టిసారిస్తారు. మీరు ఆఫీసులో ఏదైనా పొందాలంటే త్వరగా వెళ్తే కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఇతరుల గురించి ఆలోచించవద్దు. ఇంట్లో వారి గురించి ఆలోచించండి. గుర్తింపు కోసం యత్నాలు మొదలవుతాయి.

సింహ రాశి
మీకు జీవితంలో ఎదురుకానున్న అతిపెద్ద ప్రమాదం విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈరోజు మీరు ఆ రిస్క్ తీసుకోవలసిన అవసరం లేదు. నేడు ధాన్యం చేయండి. రేపటి నుంచి మీకు కొత్త ఆరంభం లభిస్తుంది. అన్ని పరిస్థితులు చక్కదిద్దకునేందుకు యత్నాలు సాగిస్తారు. మీ లక్ష్యాలపై దృష్టి సారించడం లాభదాయకం.

Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు

కన్య రాశి
ఈ రోజు ఏదైనా కార్యాన్ని సాధించడానికి ప్రేరణ ఉంటే ముందుకు సాగుతారు. సరైన సమయం కోసం వేచి ఉండకూడదు. సొంతంగా శ్రమించి సాధించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసేందుకు తగిన తరుణం ఇది. ప్రియమైనవారి పట్ల మీరు ప్రశంసలు కురిపిస్తారు. వాలెంటైన్స్ డే దగ్గరికి రావడంతో మీ జీవిత భాగస్వామి, లేక ప్రేమించిన వారికి బహుమతులు ఇవ్వాలని యోచిస్తారు.

తులా రాశి
నాయకత్వ పాత్రను పోషించడానికి ముందడుగు వేస్తారు. మీరు దానిని అలవాటుగా చేసుకోవాలి. మీ నాయకత్వంపై మంచి అభిప్రాయాలు వ్యక్తమవుతాయి.  మీ సహోద్యోగులు సైతం మీ అభిప్రాయాలను వారి మొదటి ప్రాధాన్యతగా తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ రోజు పూర్తి చేయాల్సిన పని ఏదైనా ఉంటే అంతరాయం లేకుండా పూర్తవుతుంది.

వృశ్చిక రాశి
ఈ రాశి వారికి నేడు అంతగా కలిసిరాదు. అయితే మీరు జీవితంలో గొప్ప స్థితికి చేరుకున్నారు. పదే పదే దాని గురించి చెప్పడం తగదు. ఆర్థిక విషయాలలో జాగ్రతలు తీసుకుంటారు. ఖర్చు చేయడానికి బదులుగా కొన్ని విషయాల్లో ఆదా చేయండి. సమాజం గురించి ఆలోచిస్తారు.

ధనస్సు రాశి
ఈరోజు మీ జీవితం ఊహించని మలుపు తిరిగే సూచనలు గోచరిస్తున్నాయి. మీరు చాలా కాలం నుంచి కలవని, మాట్లాడని వ్యక్తులను కలేసుకుంటారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీనిపై  చింతించకండి. ఈ అవకాశం వ్యాపారంపై చర్చకు దారితీస్తుంది. కొత్త జీవితం వైపు అడుగులు పడే అవకాశాలున్నాయి.

మకర రాశి
సుదీర్ఘకాలం తర్వాత మీరు ఇంట్లో సరదాగా ఉంటారు. స్నేహితులు లేదా కుటుంబాల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయాలని యత్నాలు సాగుతాయి. అనుకోని అతిథి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తాడు. అధికంగా విశ్రాంతి కోరుకుంటారు.

కుంభ రాశి
ఈరోజు ఏం జరిగినా సరే మీరు విసుగు చెందరు. ఉత్సాహంగా ముందుకుసాగుతారు. మీరు ఆఫీసులో ఉన్నా, ఇంట్లో, మరియు ఎక్కడికి వెళ్ళినా సరదాగా గడుపుతారు. మీ వల్ల ఇతరులు సంతోషిస్తారు. ఈరోజు మీకు చాలా అదృష్టం ఉంది.

మీన రాశి
మీతో సంబంధాలు కోరుకునేవారికి దగ్గర అవడానికి మార్గాలు అన్వేషిస్తారు. తగిన రీతిలో మాట్లాడటం అనేది మీకు కలిసొచ్చింది. మీ మనసులోని మాటల్ని, భావాల్ని వెల్లడించిన సమయం ఇది. మీకు ఇష్టమైన వారితో బంధాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News