Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 05, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 05 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 05వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2021, 07:57 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 05, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి వాహనయోగం

Horoscope Today 05 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 05వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈరోజు డబ్బు ఆదా చేయడం మీ ఏకైక ఉద్దేశ్యం అవుతుంది. కాబట్టి అవసరం లేని వాటికి ఖర్చులు చేయవద్దు. మీ జీవితంలో మీరు ఊహించని ఎవరైనా మీ పట్ల ప్రేమను చూపుతారు. ఇది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది, కానీ మీకు ఈ వ్యక్తి అంతగా తెలియదని గుర్తుంచుకోండి. గుడ్డిగా ఎవరినీ విశ్వసించరాదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు అంతగా కలిసిరాదు. ప్రయాణాల కారణంగా ఖర్చులు, ఆపై రుణ యత్నాలు ప్రారంభిస్తారు.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

వృషభ రాశి
మీరు ఎవరితోనూ బయటకు వెళ్లరు, సరదాగా సమయాన్ని గడపటం లేదని గ్రహించారా? అయితే ఈరోజు పని నుంచి విశ్రాంతి తీసుకుని మీ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయిస్తారు. అదే సమయంలో మీ కెరీర్‌ను పరిశీలించుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు మీ దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పని చేస్తున్నారా? లేకపోతే ఇప్పుడు ప్రారంభించడానికి సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన మేర ఫలితాలు రావు. కొందరి నుంచి మాట పట్టింపులు.

మిథున రాశి
వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేదు. ఈరోజు మిథున రాశి వారు ముందడుగు వేయడానికి తగిన సమయం. గతం మిమ్మల్ని వెంటాడనుంది. అయితే మీరు దానికి ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమవుతారు. పనిలో మీరు కోల్పోయినదాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారు నేడు నేర్చుకోవడంపై ఫోకస్ చేయనున్నారు. మీ కార్యాలయంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఈరోజు సమయాన్ని కేటాయిస్తారు. ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న వస్తువును కొనుగోలు చేయాలని యత్నిస్తారు. నిర్మాణాలు చేపట్టాలని కోరిక కలుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు రావడంతో మానసిక ప్రశాంతత దొరుకుతుంది.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

సింహ రాశి
మీరు వదిలిపెట్టిన పనిని మళ్లీ ప్రారంభించే దిశగా అడుగులు పడతాయి. మీరు చేయవలసిన పనుల జాబితాను మరోసారి పరిశీలించుకుంటారు. మీ సామర్థ్యం ఏమిటో తెలుసుకునేందుకు యత్నిస్తారు. మీ వ్యక్తిగత వృద్ధికి మీరు ఇంకా ఏమేం చేయగలరో గుర్తించండి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. దూర ప్రయాణాల కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.

కన్య రాశి
మీరు పనినే జీవితంగా భావిస్తున్నారు. కానీ వ్యక్తిగత జీవితం ఉందని తెలుసుకునే సమయం ఆసన్నమైంది. బయటకు వెళ్లడం, ఇతరులతో సరదాగా సమయం గడపటం ముఖ్యమని గ్రహిస్తారు. దాని వల్ల నూతన పరిచయాలు, స్నేహాలు ఏర్పడతాయి. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు నూతన సమస్యలు మొదలవుతాయి. మీరు కృతజ్ఞతను చూపించే సమయం దగ్గర్లోనే ఉంది.

తులా రాశి
మీరు ఈ రోజు నూతనోత్సాహాన్ని పొందుతారు. సోమవారం పనిని ప్రారంభించడానికి ఇది మీకు ఓ మార్గంలా కనిపిస్తుంది. నేడు అధిక సామర్థ్యంతో పనులు చేపడతారు. ఈ రోజు ఇంట్లో కొన్ని అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబానికి మీ సహాయం ఖచ్చితంగా అవసరమవుతుంది. చేపట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా 

వృశ్చిక రాశి
ఈ రోజు పనులు చేయడానికి ఏ ప్రేరణ లభించకున్నా, మీ అంతిమ లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. మీ భవిష్యత్తు ఏమిటో చూడటానికి ఇది మంచి రోజు. ప్రయాణాల కారణంగా ఖర్చు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సహకరించక రుణ యత్నాలు ప్రారంభిస్తారు. కొన్ని విషయాలు చికాకు తెప్పిస్తాయి. కొన్ని పనుల కారణంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

ధనుస్సు రాశి
మీది ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. కనుక ఇతరులు మీ దగ్గరకు పదే పదే వస్తుంటారు. మీతో సమయాన్ని గడిపేందుకు, మీ సాయం కోరేందుకు అది కారణమని మీరు గ్రహించాలి. నూతన ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమకు తగ్గ ఫలితాన్ని ఉద్యోగులు, వ్యాపారులు పొందుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

మకర రాశి
మీరు సుదీర్ఘకాలం నుంచి విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారు. నేడు మీ పని బారం మరింత అధికం కానుంది. కనుక పగటిపూట ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. మానసిక ప్రశాంతత లభిస్తే మీ పనులు తేలికగా పూర్తవుతాయి. మీ చుట్టూ ఉన్న ఒకరిపై ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో వారు మిమ్మల్ని తిరిగి ఇష్టపడవచ్చు.

Also Read: COVID-19 Vaccination: కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇది చదవండి

కుంభ రాశి
ఈ రోజు పని చేసే మానసిక స్థితిలో మీరు లేరు. బదులుగా మీ సమయాన్ని విశ్రాంతి తీసుకునేందుకుగానీ, లేదా మీరు ఇష్టపడే పనులను చేయడానికి కేటాయించాలని భావిస్తున్నారు. మీరు చేస్తున్న పనిని కచ్చితంగా కొనసాగించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరు ఎంతగా అభినందిస్తున్నారో తెలపండి. ఇది ఇతరులతో మీ బంధాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. 

మీన రాశి
ఈరోజు మీరు సహజంగానే ఉత్సాహంగా ఉంటారు. నేడు మీరు అనుకున్నది జరగబోతోంది. ఈ రోజు అదృష్టం మీ వైపు ఉంది.  అయితే, మీ విజయంలో కొంత భాగాన్ని మీ కుటుంబం కోసం ఖర్చు చేయడానికి ప్రయత్నించండి. కుటుంబసభ్యులను షాపింగ్‌కు గానీ, లేదా విందుకు తీసుకెళ్లండి. వారి సంతోషానికి కేంద్ర బిందువు అవుతారు. వాహనయోగం గోచరిస్తుంది. నూతన అవకాశాలు మీకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News