Today Horoscope, 04 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 4, 2021 Rasi Phalalu

Horoscope Today, 04 February 2021: Today Rasi Phalalu in Telugu : పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 4న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2021, 08:21 AM IST
Today Horoscope, 04 February 2021: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 4, 2021 Rasi Phalalu

Horoscope Today, 04 February 2021: ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 4న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు(Today Rasi Phalalu in Telugu) అందిస్తున్నారు.

మేష రాశి
Horoscope Today ఈ రోజు మీకు షాపింగ్ చేయాలని ఉత్సాహంగా అనిపిస్తుంది. అయితే దాని గురించి పట్టించుకోకపోవడమే లాభదాయకం. మీ ఆర్థిక పరిస్థితులను మెరుగు చేసుకునేందుకు ఇది ఒక ముఖ్యమైన సమయం. దీనికి బదులుగా మీరు ఏదైనా వేరే పనిలో నిమగ్నం అవ్వాలి. మీరు ఎక్కడికైనా నడకమార్గంలోనో లేదా స్నేహితుడితో కలిసి డ్రైవ్‌కు వెళ్లండి. ప్రస్తుతం చేసే పని మిమ్మల్ని భవిష్యత్ వైపునకు నడిపిస్తుంది.

Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు

వృషభ రాశి
ప్రతిఒక్కరూ మీ కోసం ఉన్నారని మీరు భావిస్తారు. అయితే అందులో వాస్తవం లేదని గ్రహించే సమయం ఇది. మీ చుట్టూ ఉన్నవారు కేవలం మీ విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. అందులో భాగంగా మీ అభిప్రాయాలను చాలా గౌరవిస్తారు. మీ కుటుంబానికి సమయం కేటాయిస్తారు. మీ ఆర్ధికవ్యవస్థ చాలా బాగుంది. మీకు ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఏదైనా వస్తువు కొనుగోలు సూచన గోచరిస్తుంది. 

మిథున రాశి
మీకు ఉన్న అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తారు. మీ ఉన్నతాధికారుల పట్ల మీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. ఇది మీకు శ్రేయస్కరం, లాభదాయకం. చాలా కాలం మీరు చెప్పలేని విషయాలను మీకు కావాలసిన వ్యక్తులతో పంచుకోండి. మీ ప్రేమను, అభిప్రాయాల్ని అవతలి వారు మెచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి.

కర్కాటక రాశి
పని కొంచెం నెమ్మదిగా సాగుతుందని మీరు ఆందోళన చెందవద్దు. అయితే ఇది తాత్కాలికమే. ఈ రోజు సాధారణం కంటే నెమ్మదిగా అనిపించినప్పటికీ, పనిని నమ్మకోండి. పని కాకుండా, వ్యక్తిగత విషయాలు వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మీ ప్రియమైన వ్యక్తి, మీరు ప్రయాణాలు చేస్తున్నారా.. అందుకే నిర్ణయం తీసుకునే ముందు రెండుసార్లు ఆలోచించడం ఉత్తమం.

Also Read: Antarvedi new chariot: ఫిబ్రవరి 13న అంతర్వేది రధానికి సంప్రోక్షణ

సింహ రాశి
కుటుంబ సభ్యులు వారి గురించి మాట్లాడటానికి మీకు కాల్ రావొచ్చు. అయితే మీరు వేరే పనిలో చాలా బిజీగా ఉంటారు. ఈరోజు మొదట ఆఫీసు పనులకు సమయం కేటాయిస్తారు. వ్యక్తిగత విషయాలకు ద్వితియార్థంలో శ్రద్ధ పెడతారు. మీకు ఇష్టమైన వారిని కష్టపెట్టకూడదు. మీరు కొంతకాలం నుంచి తినాలనుకున్న భోజన సూచన ఉంది.

కన్య రాశి
ఈ రోజు మీరు విజయం దిశగా దూసుకెళ్తారు. పనిలో కొత్త ప్రాజెక్ట్ దక్కుతుంది, ఇది స్థాన చలనానికి దారి తీస్తుంది. ఇంట్లో, మీ భాగస్వామితో మీ సంబంధాలు మెరుగుపడుతున్నాయని భావిస్తారు. పలువురు మిమ్మల్ని సంప్రదించి మిమ్మల్ని అభినందిస్తున్నారు. ఈరోజు మీకు ఆర్థికంగా శుభసూచకం గోచరిస్తోంది.

తులా రాశి
ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధించనట్లు మీకు అనిపించవచ్చు. అయితే ఆ ఫలితాలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. మీరు ఇష్టపడే వ్యక్తి త్వరగా మీకు ప్రతిస్పందించకపోవచ్చు. అయితే వారి కోసం ఓపికగా ఎదురుచూడటం ఉత్తమం. అదే సమయంలో పనిలో మీరు మీ సహనాన్ని ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతారు. మీరు త్వరలో మీ ప్రమోషన్ పొందుతారు, అయితే అందుకోసం కాస్త ఓపికపట్టాలి.

Also Read: Copper Health Benefits: రాగి కడియం ధరించే అలవాటు ఉందా, Copper Benefits తెలుసుకోండి

వృశ్చిక రాశి
మీరు ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. మీరు ఈ మధ్య కాస్త బద్ధకంగా ఉంటున్నారు. మళ్లీ శ్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు రేసులో ఉన్నారని మీ సహోద్యోగులకు చూపించండి. మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు. అయితే వ్యక్తం చేయడంలో కాస్త వెనుకడుగు వేస్తారు. కానీ మీ ప్రయత్నాల ద్వారా వారు మిమ్మల్ని అభినందిస్తారు.

ధనస్సు రాశి
ఈ మధ్య విషయాలు మీకు ఉద్రిక్తంగా మారుతుంటాయి. ప్రతిదానికీ మీకు విరామం అవసరం. ఈ రోజు మీ పని నుంచి విరామం తీసుకుని ఇంట్లోని సభ్యులతో గడుపుతారు. కొంత సమయం ఒంటరిగా గడపండి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

మకర రాశి
ఈరోజు మీ ప్రేమ ఫలిస్తుంది. ప్రేమ ఎల్లప్పుడూ మీ మొదటి ప్రాధాన్యత కాకపోవచ్చు, కానీ ఈ రోజు మీకు నచ్చిన వ్యక్తికి ఏదైనా చేసేందుకు ప్రయత్నిస్తారు. వారు మిమ్మల్ని తిరిగి ఇష్టపడవచ్చు. మీరు ప్రేమను వ్యక్తం చేయనంతవరకు వారికి కూడా ఇది ఎప్పటికీ తెలియదు. ఈ రోజు మీ పనిపై కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. ముందడుగు వేస్తే ఈరోజు విజయవంతమవుతుంది.

కుంభ రాశి
పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తారు. మీ ఇల్లు మరియు కార్యాలయాన్ని శుభ్రం చేయడానికి నిర్ణయాలు తీసుకునే సూచన కనిపిస్తుంది. మీ ఇంటిని అలంకరించడానికి మీరు ఎందుకు చేయకూడదు? అందంగా డెకరేట్ చేసుకోవాలని భావిస్తారు. తద్వారా మీకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. మీ పనులు నేడు తేలిక అవుతాయి.

Also Read: ATM Alert: ఇక నుంచి ఆ ATM Transactions మీరు చేయలేరు, కారణమేంటో తెలుసా

మీన రాశి
ఏదైనా పని చేయాలనుకుంటే ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఏదైనా కావాలంటే మీన రాశి వారు దాని కోసం వెళ్ళాలి. పనిలో మీరు మీ స్థానం కోసం పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇంట్లో మీ ప్రియమైన వ్యక్తి నుంచి కాస్త సమయం కోరుకుంటారు. మీరు ఎలా భావిస్తున్నారో వారితో పంచుకోవాలి. మాటల ద్వారా మీకు ఫలితం గోచరిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News