Horoscope Today 03 June 2021: మేష రాశి
ఈరోజు మీరు ఆందోళన చెందుతారు. మానసిక పరిస్థితి సరిగా ఉండదు. ఈ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించండి. చివర్లో మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి
గత కొన్ని రోజుల నుంచి తీరిక లేకుండా పనులు చేస్తున్నారు. కనుక పని నుంచి విరామం తీసుకుని కుటుంబంతో సరదాగా గడపాలని భావిస్తారు. తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనిచేసేచోట కొత్త విషయాలు నేర్చుకోవడం మీకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
Also Read: Sun Halo Spotted in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం, Photo Gallery
మిథున రాశి
ఈరోజు మీకు అంతగా కలిసిరాదు. కనుక ఏవైనా కొత్త పనులు ప్రారంభించడం గానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయడానికి తగిన సమయం కాదు. కెరీర్‌పై దృష్టిసారిస్తారు. పనులలో జాప్యం ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో పునరాలోచించాలి.
కర్కాటక రాశి
మీకు ఏమి కావాలో తెలుసు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఈ రోజు వ్యాయామం, ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించాలి. వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
సింహ రాశి
ఆర్థిక విషయాలను మీరు సమీక్షించుకుంటారు. అనవసర వస్తువులకు డబ్బు ఖర్చు చేయరాదని గ్రహిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ఉన్నతాధికారులు గమనిస్తారు. పనిలో మీకు గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
కన్య రాశి
గతంలో మీకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చిన విషయాలపై ఫోకస్ చేస్తారు. తద్వారా మరోసారి రాణించేందుకు ప్రణాళికలు రచిస్తారు. అయితే మీ వ్యవహారశైలిలో మార్పులు రాకుండా ఆలోచనలో మాత్రమే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. నేడు మీకు ధనం చేతికి రానుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారులకు సాధారణ ఫలితాలు.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
తులా రాశి
మీరు కష్టపడి పనిచేసే తత్వం గలవారు. కానీ పని నుంచి సైతం విరామం తీసుకుని, ప్రజలకు దూరంగా గడపాలనుకుంటారు. యువత ఈ రోజు కెరీర్‌పై దృష్టిసారిస్తారు. కారు లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చులు అధికం కానున్నాయి. ప్రయాణాలు చేసే సూచన కనిపిస్తోంది. ఉద్యోగులకు సాధారణ ఫలితాలు వస్తాయి.
వృశ్చిక రాశి
మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటపడతారు మరియు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇందులో భాగంగా కొత్త కెరీర్ దిశగా అడుగులు పడతాయి. ఉద్యోగులైతే పనిలో మీకు అప్పగించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని భావిస్తారు. సన్నిహితులతో వివాదాలు చికాకు తెప్పిస్తాయి. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలించవు.
ధనుస్సు రాశి
గతంలో చేసిన తప్పుల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. కేవలం ఆ విషయాలను తలుచుకుని బాధపడవద్దు, మీ కుటుంబం కోసం మీరు సాధించిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచిస్తారు. మీతో గొడవ పడిన మిత్రుడితో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారు.
మకర రాశి
గతంలో మీరు వదులుకున్న అవకాశం గురించి చింతించకుండా, భవిష్యత్తుపై దృష్టిపెడతారు. మీరు కష్టపడి పనిచేస్తే ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం. ఈ సమయంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరు.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
కుంభ రాశి
మీరు చేపట్టిన పనిలో ముందడుగు పడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమించిన వ్యక్తిని అంగీకరించాలా వద్ద అనే దాని గురించి ఆలోచిస్తారు. వాస్తవానికి కొన్ని రిస్క్‌లు తీసుకోవాలనుకోవచ్చు. తద్వారా మీరు ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
మీన రాశి
ఆస్తి వివాదాలు చికాకు తెప్పిస్తాయి. కుటుంబసభ్యుల మధ్య గొడవలు వస్తాయి. అయితే, మీ ఆరోగ్యంపై కొంచెం దృష్టి పెట్టాలని భావిస్తారు. మీ కుటుంబం, స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. వ్యాపారులకు అన్ని విషయాలు కలిసొస్తాయి. ఖర్చులు అధికం కావడంతో కొంత ఆందోళన చెందుతారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook