Horoscope Today 02 June 2021: మేష రాశి
మేష రాశి ఈ రోజు సంతోషంగా ఉంటారు మరియు మీ చుట్టూ ఉన్నవారిని సైతం నవ్వుల్లో ముంచెత్తుతారు. ఇంట్లో అందరూ కలిసికట్టుగా ఉంటారు. పెళ్లయిన వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగులకు కొన్ని నిర్ణయాలలో శ్రద్ధ వహించాలి. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది.
వృషభ రాశి
మీరు మరింత ఆధ్యాత్మిక దిశగా అడుగులు వేయనున్నారు. నేడు మీ నోరును అదుపులో పెట్టుకోవాలి. లేని పక్షంలో కొన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి. గతంలో చేసిన పెట్టుబడులు మీకు లాభాలు తీసుకొస్తాయి. ఉద్యోగులకు పనికి తగ్గ గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు గోచరిస్తున్నాయి.
Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి
మిథున రాశి
చాలాకాలం తరువాత కొందరు స్నేహితులను కలుసుకుంటారు. పిల్లల చదువుపై ఇంట్లో చర్చ జరుగుతుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు అనుకూలించవు. మీతో వ్యాపారాలు చేసేవారు, ఈ రోజు కంపెనీలో పెట్టుబడులు పెట్టకూడదని సలహా ఇస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
కర్కాటక రాశి
మీరు చాలా చురుకుగా ఉండే అవకాశం ఉంది. మీ శక్తి సామర్థ్యాలను ప్రమోషన్ వినియోగించాలని కొందరు మీకు సలహా ఇస్తారు. మీ భవిష్యత్తు గురించి మరియు స్థిరపడటం గురించి వాదించవచ్చు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నేడు మీకు ధనవ్యయం గోచరిస్తుంది. పనులు వాయిదా పడతాయి.
సింహ రాశి
కుటుంబ విషయాలలో తీరిక లేకుండా గడుపుతారు. కొన్ని సమస్యలపై చర్చించి ఇంట్లో వివాదాలను పరిష్కరిస్తారు. కుటుంబం కోసం ఈరోజు పనులను పక్కన పెడతారు. వ్యాపారులైతే పెట్టుబడులకు ఇది తగిన సమయం కాదు. కష్టపడి శ్రమిస్తే ఉద్యోగం మీ సొంతం. కొన్ని శుభవార్తలు అందుతాయి.
కన్య రాశి
మీరు చాలా ఓపికగా వ్యవహరిస్తారు. కుటుంబంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఈ రోజు పరిష్కారమవుతాయి. కొత్త జంటలు ఏకాంతంగా సమయాన్ని గడపాలని ఆలోచిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలని భావిస్తే అందుకు తగిన సమయం.
Also Read: Fertility Myths: సంతానలేమిపై మగవారిలో 5 ముఖ్యమైన సందేహాలు, వాటి సమాధానాలు
తులా రాశి
నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు చదువుపై కొంచెం అదనపు దృష్టిసారించాలని పెద్దలు సూచిస్తారు. వ్యాపారులకు గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్లకూడదు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు చేస్తారు.
వృశ్చిక రాశి
నేడు మీ పనులు చాలా తేలికగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చేతికి అప్పగిస్తారు. పని నుంచి కాస్త విరామం తీసుకుని మీ తల్లిదండ్రులతో ఇంట్లో కొంత సమయం గడుపుతారు. పిల్లల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. బయట తిరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
ధనుస్సు రాశి
నేడు ధనుస్సు రాశి వారిని అదృష్టం వరించనుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు.
మకర రాశి
గతంలో తలెత్తిన సమస్యలను, వివాదాలను పరిష్కరించుకుంటారు. కొన్ని విషయాలలో సన్నిహితుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. ఒంటరి వ్యక్తులు ప్రేమలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనసు మీ మాట వినదు. పనులు పక్కన పెట్టి పరధ్యానంలో ఉంటారు. అయితే మీ సామర్థ్యాన్ని గుర్తించి మిమ్మల్ని నాయకుడిగా ఉండాలని కోరతారు. కొత్త ఇల్లు కొనుగోలుకు ఆలోచిస్తారు.
Also Read: Lunar Eclipse 2021: చంద్ర గ్రహణం ఈ రాశుల వారిపై ప్రభావం చూపుతుంది
కుంభ రాశి
మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగావకాశాలు గోచరిస్తున్నాయి. చికిత్స తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. చాలా కాలం ఎదురుచూపుల తరువాత చేతికి ఆస్తి రానుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. .
మీన రాశి
ఈ రోజు మీరు ప్రయాణాలు చేయకూడదని, డ్రైవింగ్ జోలికి వెళ్లకూడదని పెద్దలు సూచిస్తారు. ఇదివరకే చాలామేరకు పనులు పూర్తి చేసినందున కాస్త విశ్రాంతి తీసుకుంటారు. ఇంట్లో కొన్ని విషయాలలో విభేదాలు తలెత్తుతాయి. కానీ చర్చల ద్వారా పరిస్థితి చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook